Oplus_0

రైతులకు మన పరిజ్ఞానం ఉపయోగపడే విధంగా కృషి చేయాలి.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూలై-27:

భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ పంటల సమృద్ధిగా పండాలంటే ఎరువులు ముఖ్యం. ఎరువులు సరఫరా చేసి డీలర్లకు వాటిపై సరైన అవగాహన ఉండాలని, తద్వారా రైతుల పంటలకు అవసరమైన ఎరువులను ఇవ్వడంలో డీలర్ లు అవగాహన కలిగి ఉంటారని సదుద్దేశంతో, కేంద్ర ప్రభుత్వం దేశంలోని వ్యవసాయ ఎరువుల డీలర్ లకు “దేశి” ప్రోగ్రాం ప్రవేశపెట్టి, ఒక సంవత్సరం కాలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి అనంతరం పరీక్షలు నిర్వహించి పరీక్షలలో ఉత్తీర్ణులైన వారందరికీ డిప్లమో సర్టిఫికెట్స్ ప్రధానం చేస్తారు.

శనివారం రోజు పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లాలోని దేశి ప్రోగ్రాం కింద శిక్షణ పొంది పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారందరికీ డిప్లమో సర్టిఫికెట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

డిప్లమో కోర్సులు మనం నేర్చుకున్న పరిజ్ఞానం రైతులకు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని అన్నారు.
శనివారం దేశీ ప్రోగ్రాం శిక్షణలో భాగంగా డిప్లోమా కోర్సు పూర్తి చేసుకున్న వ్యవసాయ విత్తన డీలర్లకు సర్టిఫికెట్లను పంపిణీ చేస్తున్నామన్నారు.

48 వారాల పాటు శిక్షణ పూర్తి చేసుకుని డిప్లమా పట్టపొందిన డీలర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. డిప్లమో కోర్సు ద్వారా సమస్యల కాలం పాటు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా చూడాలని సూచించారు.2022-23 సంవత్సరం జిల్లాలో 2 బ్యాచ్ లలో మొత్తం 80 మంది ఇన్ ఫుట్ డీలర్లకు శిక్షణ ప్రారంభించామని, వీరికి 40 వారాలపాటు ప్రత్యేక తరగతులు, 8 వారాలు క్షేత్రస్థాయి సందర్శన ద్వారా శిక్షణ అందించి మార్చి 25 నుంచి మార్చి 28 వరకు తుది పరీక్షలు నిర్వహించి వారికి వచ్చిన మార్కుల ఆధారంగా గోల్డ్, సిల్వర్, బ్రాంచ్ సర్టిఫికెట్లు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ డీలర్లకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.