Oplus_0

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూలై -29 :

రైతు రుణమాఫీ రెండవ విడత నిధులను ప్రభుత్వం జూలై 30న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జూలై 30న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధుల సమక్షంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందని, రైతులకు లక్షా 50 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు.

రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది సహకార శాఖ సిబ్బంది బ్యాంక్ సిబ్బంది పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో రుణమాఫీ లబ్ధిదారులు రైతులు , ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు