డి.ఆర్.డి.ఓ. ఆర్.రవీందర్.
అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూలై -30:
దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం జూలై 31న బుధవారం ఉదయం 11-35 గంటల నుండి మీ- సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆర్.రవీందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా సదరం సర్టిఫికేట్ కావాల్సిన వారు, తాత్కాలిక సదరం సర్టిఫికేట్ ఉన్నవారు రెన్యువల్ కొరకు దరఖాస్తులు చేసుకోవాలని, మానసిక అంగ వైకల్యం, బుద్ది మాన్యం ఉన్న వారు ఆగస్టు 8న నిర్వహించు క్యాంప్ స్లాట్ కొరకు, దృష్టి లోపం, వినికిడి లోపం ఉన్నవారు ఆగస్టు 22న నిర్వహించు క్యాంప్ స్లాట్ కొరకు, శారీరక అంగ వైకల్యం గలవారు ఆగస్టు 1, ఆగస్టు 29 నాటి క్యాంప్ స్లాట్ కొరకు జూలై 31న ఉదయం 11-35 గంటల నుండి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ నమోదు చేసుకోవాలని, స్లాట్ బుకింగ్ అనంతరం మెడికల్ క్యాంపులకు వచ్చే సందర్భంలో దరఖాస్తుదారులు మీసేవ సదరం స్లాట్ బుకింగ్ రసీదుతో పాటు వికలాంగత్వ పరీక్షా కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, వ్యక్తిగత మెడికల్ రిపోర్ట్ లను తీసుకొని రావాలని అన్నారు .
కొత్తగా సదరం సర్టిఫికెట్ కావాల్సిన వారు ఇంతకు మునుపే మీసేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసినట్లయితే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు డిపార్ట్మెంట్ ద్వారా క్యాంప్ యొక్క వివరాలు మెసేజ్ (ఎస్.ఎం.ఎస్.) ద్వారా వస్తాయని, అట్టి మొబైల్ ఫోను తప్పనిసరిగా క్యాంపుకు తీసుకొని రావాలని డి.ఆర్.డి.ఓ. ఆర్. రవీందర్ ఆ ప్రకటనలో తెలిపారు.
