రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్.

అగ్నిధారన్యూస్, కరీంనగర్
రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులకు గ్రామీణ కూలీలకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

మంగళవారం రోజున రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ పమెలా సత్పతి గారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ పాలకులు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు కోసం కృషిచేయాలని, అందులో భాగంగానే వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయల భృతి చెల్లించాలని, ఆసరా పెన్షన్ మాదిరిగానే 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కూలీలకు 6 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించి రోజు వారి కూలి 700 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి కూలీల పెండింగ్ బిల్లుల తో పాటు సమ్మర్ అలవెన్స్ వెంటనే విడుదల మున్సిపాలిటీ లలో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేయాలని అన్నారు. గ్రామాల్లో చాలా సంవత్సరాలు గా ప్రభుత్వాలు ఇండ్లు మంజూరి చేయకపోవడం వల్ల ఇండ్లు లేని పేదలు గుడిసెలు వేసుకొని,అద్దె ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నిర్మించి ఉన్న ఇండ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణి చేయాలని అన్నారు.

ప్రస్తుత పాలకులు వ్యవసాయ కూలీలకు, గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు కూలీ బందు పథకం అమలు చేయాలని,ఎన్నికల గ్యారంటి లలో భాగంగా ఇండ్లు లేని పేదలకు గృహ జ్యోతి పథకం కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఇంటి స్థలం లేని వారికి స్థలం ఇచ్చి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సాగు భూమి లేని వ్యవసాయ కూలీలకు, గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వ భూములను పంపిణి చేయాలని లేని పక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ పోరాటలు చేస్తామని సృజన్ కుమార్ హేచ్చరించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు బోయిని అశోక్ జిల్లా నాయకులు ఎగుర్ల మల్లేశం, నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.