తహశీల్దార్ తో పాటు మరో ఇద్దరు పట్టివేత.

అధికారుల అండదండలతో వీఆర్ఏ గా ఒకరి స్థానంలో మరొకరు.

చాకచక్యంగా తహశీల్దార్ పట్టుకున్న ఏసీబీ అధికారులు.

అగ్నిధారన్యూస్ కాల్వ శ్రీరాంపూర్:
శనివారం రోజు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడులతో ఉద్యోగులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మంచిర్యాల జిల్లా మందమరి పట్టణానికి చెందిన కాడం తిరుపతి కాల్వ శ్రీరాంపూర్ శివారు గ్రామంలో గల 0.28 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కొరకై మూడుసార్లు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ జావేద్ పాషా ఆదేశాలతో కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏ దాసరి మల్లేశం కుమారుడు దాసరి ధర్మేందర్,(విష్ణు) కు పలు దఫాలుగా 15000,20000,15000, కు బాధితుడు కాడం తిరుపతి ఫోన్ పే చేశాడు అని తెలిసింది. అయినప్పటికీ పని కాకపోవడంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకోవడంతో కలెక్టర్ ఇట్టి పరిశీలనను పరిగణలోకి తీసుకొని పని పూర్తి చేసినట్లు తెలిసింది. గత నెల జూలైలో ఇరువై మూడో తేదీన కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ జావేద్ పాష, కాడం తిరుపతి పిలిపించుకొని మరో 20 వేల రూపాయలను చెల్లించాల్సిందిగా హుకుం జారీ చేయడంతో పదివేల రూపాయలు చెల్లిస్తానని బాధితుడు తెలిపాడు. దీంతో కరీంనగర్ లోని ఏసీబీ అధికారులను బాధితుడు సంప్రదించగా ఏసీబీ,రమణమూర్తి డిఎస్పీ, కృష్ణకుమార్ సిఐలు కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్, ఆయన డ్రైవర్ మహమ్మద్ ఆమ్జాద్ పాషా , దాసరి ధర్మేందర్ ( విష్ణు )వలపన్ని పట్టుకున్నారు. ఇదిలా ఉంటే తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ గా పని చేయాల్సిన దాసరి మల్లేశం కు బదులు ఆయన కుమారుడు దాసరి ధర్మేందర్ ( విష్ణు ) గత కొద్ది రోజుల నుండి పనిచేస్తుండడంతో అధికారుల అండదండలతోటే ఇలా ఒకరు స్థానంలో ఇంకొకరు పని చేస్తున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.