అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపారు మహిళా శ్రేణులు సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని ఎనిమిదో వార్డులో ఇంటిముందు బురదమయం, గుంతలు పడ్డ రోడ్డుపై, 8వార్డ్ కౌన్సిలర్ చింతల సునీత నిర్లక్ష్య వైఖరికి 8 వార్డ్ మహిళలు రోడ్డుపై నాటు వేసి నిరసన తెలిపారు. వానలకు రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో పలువురు మహిళలు వరి నాటు వేశారు. బిఆర్ఎస్ పార్టీ మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిప్పారపు కమల ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.8 వార్డు లో రోడ్ల దుస్థితిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని మున్సిపల్ అధికారులు పట్టించుకోని సుల్తానాబాద్ అభివృద్ధికి తోడ్పడాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.
