అగ్నిధారన్యూస్ (జగిత్యాల) మల్యాల మండలం పోతారం గ్రామంలో ఆదివారం జగిత్యాల పట్టణంలోని జంబిగద్దే చౌరస్తాలో గల శ్రీపావని మల్టీస్పేషాలిటి హాస్పిటల్ డా. శ్రీకాంత్ రెడ్డి యం.డి ఆద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతి ఆవరణలో నిర్వహించిన వైద్య శిభిరానికి విశేష స్పందన లబించింది. దాదాపు 189 మంది రోగులకు ఉచితంగా బి.పి., షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీపావని ఆసుపత్రి వైద్యులు డా. శ్రీకాంత్ రెడ్డి మాట్లడుతూ, ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య శిబిరాల్లో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరుగుతుందని, తద్వారా సకాలంలో చికిత్స పొందవచ్చన్నారు. ప్రజలు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మిన్ ప్రభాకర్, జలంధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

