కొంగు బంగారంగా భూపతిపూర్ భూసమేత స్వామి.

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:

400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం కొండ సోరికలో గోవిందుడి కొలువైన ఆలయంలో స్వయంభు విగ్రహమే కాదు, ఈ ఆలయంలో ఉన్న కొండ కూడా ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పచ్చని పకృతి ల నడుమ భక్తులను అనుగ్రహించడానికి భక్తవత్సలుడుగా వెలసిన ఆలయం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని భూపతిపూర్ గ్రామంలో కొలువై ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే 400 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం స్వయంభు ఆలయంగా మానవ నిర్మితంగా కాకుండా ఏర్పడిందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆ గుట్ట సొరికలోని శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంభుగా దర్శనమిస్తున్నాడు. 350 సంవత్సరాల క్రిందట ఈ గ్రామంలోని ప్రజలకు అంటువ్యాధులు సోకడంతో ఈ గుట్ట ప్రాంతంలోకి వచ్చి ఉండడంతో ఓ భక్తుడికి కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి నేను ఇక్కడ స్వయంభుగా ఈ గుట్ట ప్రాంతంలో వెలిసి ఉన్నాను. నన్ను పూజిస్తే మీ అందరి అనారోగ్యాలు తొలగిస్తానని ఆ భక్తుడికి అభయం ఇవ్వడంతో, భూదేవి సహితుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిగా వెలసినందున ఈ యొక్క గ్రామానికి భూపతిపూర్ గా పేరు రావడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఇక్కడి సొరికలో చీకటి ఎక్కువగా ఉండడం వల్ల భక్తులకు మిట్ట మధ్యాహ్నం తర్వాతే ఇక్కడ స్వామివారి పూర్తి నిజ దర్శనం ఇస్తాడని భక్తులు తెలుపుతున్నారు. సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే వ్యాధులు త్వరగా నయం అవుతాయని భక్తులు తెలుపుతున్నారు. ఆలయ స్థల పురాణ ప్రకారం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఆలయాన్ని నిర్మించలేదని అతి పెద్ద గుట్టనే ఆలయంగా విరాజిల్లుతోందని గ్రామస్తులు తెలుపుతున్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా దర్శనమిస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇక్కడి స్వామి వారిని దర్శిస్తే కరువు కాటకాలు రాకుండా భక్తులు సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇంతటి మహిమగల భూపతిపూర్ భూ సమేత స్వామిని దర్శించుకోవడానికి ఈ శ్రావణ మాసంలో వెళ్లాల్సిందే మరి….. దేవదాయ శాఖ అధికారులు అటువైపు దృష్టి సారించి ఆలయాన్ని మరింత వెలుగులోకి తేవలసిన అవసరం ఎంతైనా ఉంది.