హత్య కేసులో ఏ1. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్
రెండు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో పట్టపగలే జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు సేదించారు. శనివారం రోజు పెద్దపల్లి ఏసీపీ కార్యాలయ ఆవరణలో పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
నిందితుని వివరములు:
కలవేన లక్ష్మయ్య తండ్రి ఓదెలు, వయస్సు 60 సం. లు, ముదిరాజ్, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ కొత్తపల్లి పెద్దపల్లి మండలo.
నేర వివరములు : పిర్యాది కలవేన సాయి కృష్ణ, తండ్రి రాజేశం, వయసు:30 సం.లు, ముదిరాజ్, వ్యవసాయం కొత్తపల్లి తండ్రి అయిన మృతుడు కలవేన రాజేశం తండ్రి: లచ్చయ్య, 68 సం.లు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కొత్తపల్లిని భూవివాదాలు మనసులో పెట్టుకొని తేది: 19.09.24 రోజున మధ్యాహ్నం సుమారు 12:30 నుండి 1:00 మధ్యలో ప్రాంతంలో తన పొలం దగ్గర మోటార్ సైకిల్ పెట్టి పనులు చూసుకుని తిరిగి ఇంటికి వెళ్ళు క్రమంలో మోటార్ సైకిల్ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేసుకుని వెళ్ళు క్రమంలో నిందితుడైన కలవేన లక్ష్మయ్య తండ్రి: ఓదెలు, 60 సంవత్సరాలు రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి అనునతడు ఇతని ఇద్దరు తమ్ముళ్ల కలవేన మల్లయ్య రాజయ్య లు కలిసి గొడవ పెట్టుకొని పథకం ప్రకారం కర్రతో వెనుక నుండి తలపై కొట్టి చంపినారని ఫిర్యాదు.
దానితో ఎస్ ఐ, లక్ష్మణ్ రావు కేసు నమోదు చేయగా, ఆతర్వాత కేసు దర్యాప్తులో భాగంగా పెద్దపల్లి సీఐ, ప్రవీణ్ కుమార్ కేసు ను దర్యాప్తు చెయ్యడం జరిగింది. కుటుంబ సభ్యుల సాక్షులను విచారించి నిందితుడిని తేది: 19.09.2024 నాడు మద్యాహ్నం కొతపల్లి గ్రామంలో అతని ఇంటి వద్ద పట్టుకోవడం జరిగింది శుక్రవారం రోజు రిమాండ్ కు పంపడం జరుగుతుంది.
నేరం చేసిన విధానం
నేరస్తుడైన కలవెన లక్ష్మయ్య రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఇతని సొంత గ్రామం కొత్తపల్లి ప్రస్తుతం తన భార్య, కూతురు, ఇద్దరు కొడుకులు తో కలిసి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం తీగల్పహాడ్ లో ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు కలవేన రాజయ్య మల్లయ్య వీరు కొత్తపల్లి గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉంటారు. వీరికి ముగ్గురికి కొత్తపల్లి గ్రామంలో పలు సర్వే నెంబర్లు వ్యవసాయ భూములు కలవు. వీరికి పాలివారైనా మృతుడు కలవేన రాజేశం రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఇతనికి కూడా వీరి పక్కనే వ్యవసాయ భూములు ఇల్లు కలవు. గత 15 సంవత్సరాల నుండి వీరికి ఈ భూముల సరిహద్దుల విషయంలోనూ ఇంటి దగ్గర భూములు సరిహద్దుల విషయంలోనూ పలు వివాదాలు నడుస్తున్నవి. చాలాసార్లు పెద్ద మనుషులలో పంచాయతీలు అయినవి కోర్టులో కూడా కేసులు నడుస్తున్నవి. అయినప్పటికీ మీరు వివాదం అలాగే ఉంది. ఈ క్రమంలో కలవెన లక్ష్మయ్య మరియు ఇతని ఇద్దరు తమ్ముళ్ళు, కలవెన రాజేశంపై కక్ష పెంచుకొని ఈ భూ వివాదాలు వారికి అనుకూలంగా మార్చుకోవడం కోసం కేసుల నుండి ఉపశమనం పొందడం కోసం అతన్ని అడ్డు లేకుండా చేసుకుంటేనే వీరి సమస్యలు పరిష్కారం అవుతాయని భావనతో ఎలాగైనా అతన్ని చంపాలని కుట్ర పన్ని, అవకాశం కోసం ఎదురుచూస్తుండగా తేదీ 19.9. 24 రోజున లక్ష్మయ్య తన తల్లి కి మందులు తీసుకొద్దామని కొత్తపల్లికి రాగా అదే రోజు మృతుడైన రాజేశం తనతో వివాదమున్న కలవేన రాజయ్య భూమి దగ్గర కొలిపిస్తున్నాడని సమాచారం తెలుసుకొని వీరు ముగ్గురు అన్నదమ్ములు కలుసుకొని ఇదే అదునుగా భావించి రాజేశం తన భూమికి దగ్గరలో ఉన్న రోడ్డుపైన మోటార్ సైకిల్ పార్కింగ్ చేసి తన పొలం పనులు చూసుకొని తిరిగి వస్తుండగా, వీరు ముగ్గురు అన్నదమ్ములు మాటు వేసి పథకం ప్రకారం రాజేశంతో వాగ్వివాదం చేసుకొని ముందే ఏర్పాటు చేసుకున్న కర్రతో లక్ష్మయ్య వెనుకవైపు నుండి తలపై కొట్టగా బండి పై నుండి కింద పడిన రాజేశం ను అదే కర్రతో తలపై పలుమార్లు లక్ష్మయ్య , మల్లయ్య ఇద్దరు కలిసి కొట్టగా మృతుడు అక్కడికక్కడే మరణించినాడు. వెంటనే లక్ష్మయ్య మల్లయ్య మరియు రాజయ్య ముగ్గురు అక్కడి నుండి పారిపోయినారు.
తేది 20.09.2024 నాడు నమ్మదగిన సమాచారం మేరకు మధ్యాహ్నం నేరస్థుడు లక్ష్మయ్య కొత్తపల్లి గ్రామంలోని తన ఇంటి వద్దకు వచ్చినాడని తెలిసి సిఐ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి లక్ష్మయ్యను పట్టుకొని పంచ సమక్షంలో విచారించగా అతను భూ వివాదాలు మనసులో పెట్టుకొని తన తమ్ముళ్ళతో కలిసి రాజేషంను చంపినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి నేరం చేయడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ కర్రను అతని రక్తపు బట్టలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నారు. ఈ కేసులో కలవేన రాజయ్య, మల్లయ్య లు పరారీలో ఉన్నారు అని తెలిపారు. కేసు విచారణలో వారి పట్టుబడిన అనంతరం కేసు పూర్తి వివరాలు తెల్వాల్సి ఉంది.
సాక్ష్యాధారాలను సేకరించి కేసును ఛేదించి నిందితుని పట్టుకున్న పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ఎస్ ఐ లక్ష్మణ్ రావు, సిబ్బందిని పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ అభినందించారు.
