బహుమతులు ప్రధానం చేసిన శ్రీ చిన్న జీయర్ స్వామి.

విద్యార్థులకు ప్రశంసలు, ఉపాధ్యాయులకు అభినందనలు.

అగ్నిధారన్యూస్ హైదరాబాద్// పెద్దపల్లి:

ప్రజ్ఞా వికాస్ ట్రస్మ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వ్యాసరచన పోటీలో పేగడ అక్షర , చిత్రలేఖన పోటీలో హస్మిత జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సోమవారం రోజు హైదరాబాదు ముచింతల్లో శ్రీ చిన్న జీయర్ స్వామి చేతులు మీదుగా తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ ప్రతి తల్లి తన బిడ్డను నవమాసాలు మోసి ఎన్నో కష్టాలను ఓర్చుకొని జన్మనిచ్చి ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది అన్నారు. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ప్రతి తల్లికి పునర్జన్మే అదే విధంగా మనం జన్మించినప్పటి నుండి మనం కడతేరే వరకు చివరికి మనల్ని తనలో ఐక్యం చేసుకునేది మనం పుట్టిన భూమి ఇంతటి ఘనత కలిగిన మాతృభూమి ఋణం తీర్చుకునే అదృష్టాన్ని ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి సామాజిక జీవనం కొనసాగించాలి అన్నారు.మంచి సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైనది.ఎందుకంటే నేటి విద్యార్థులే భావి సమాజ నిర్మాతలు. అలాంటి విద్యార్థులు చరవాణిలా వ్యాపకంలో పడిపోయి చెడు వ్యసనాలకు లోనవుతున్నారు అన్నారు. సమాజం ఎటువైపు ప్రయాణిస్తుందో చూస్తే భయభ్రాంతులను కలిగిస్తుంది అన్నారు. దానికి తోడు తల్లిదండ్రులు తమ పిల్లల చెడు ప్రవర్తనలను చెడు అలవాట్లను గమనించకపోవడం, తగిన మాటలతో మందలించకపోవడం వల్లనే వీటంతటికి కారణాలు అవుతున్నాయి అన్నారు.ఇలాంటి దృశ్యాలు దృష్టిలో పడితే, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకొని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ మాతృభూమిపై కృతజ్ఞత భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నోబెల్ స్కూల్ విద్యార్థులను ఆశీర్వదించారు. ఉపాధ్యాయులను అభినందించారు.