అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా:
ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పెద్దపల్లి కేంద్రానికి చెందిన బొంకూరి సురేందర్ సన్నీని నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా,రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా పని చేయాలని సన్నీకి సూచించారు. తన నియామకానికి సహకరించిన సురేందర్ రెడ్డికి సన్నీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్ధానిక సంస్థల్లో ఏ ఐ ఎఫ్ బీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా పని చేస్తానని ఈ సందర్భంగా సన్నీ అన్నారు.
