సీఎంఆర్ఎఫ్ , కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు చేయించిన మంత్రి.

– లబ్దిదారుల ఇంటివద్దకే వెళ్లి 132 చెక్కులు అందజేత

– మంత్రి వ్యక్తిగత (పిఏ) సహాయకులు ఆకుల చంద్రశేఖర్.

అగ్నిధారన్యూస్ మంథని :

రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తి మండలములకు చెందిన సీఎంఆర్ఎఫ్ , కల్యాణ లక్ష్మి లబ్ధిదారుల చెక్కులను మంగళవారం రోజున వారి గ్రామం వద్దకే వెళ్ళి మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు అందజేయడం జరిగింది.పాలకుర్తి మండలం 22 చెక్కులు : రానాపూర్ , కన్నాల , జిడి నగర్,కమాన్ పూర్ మండలం 41 చెక్కులు : కమాన్ పూర్ , జులపల్లి, గుండారం,సిద్దిపల్లి,శలపల్లి, నాగారం , పెంచికళ్ పేట, రొంపి కుంట, పేరపల్లి,రామగిరి మండలం 63 చెక్కులు : రామయ్యపల్లి (బుధవారం పేట), లద్నాపూర్, రాజాపూర్, ఆదివారం పేట, బేగంపేట, నవాబ్ పేట, నాగ పెల్లి, రత్నాపూర్, పన్నూరు, సెంటనరీ కాలనీ, కల్వచర్ల, పెద్దంపేట్, సుందిళ్ల, మంగళపల్లి, సింగిరెడ్డిపల్లి, జల్లారం, చందనాపూర్ గ్రామల చెక్కులను నేరుగా లబ్ధిదారుల చేతికి అందజేయడం జరిగింది. మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గంలోని పాలకుర్తి మండలానికి సీఎంఆర్ఎఫ్ -9/కల్యాణ లక్ష్మి-13 చెక్కులు, కమాన్ పూర్ మండలానికి సీఎంఆర్ఎఫ్-25, కల్యాణ లక్ష్మి-16 చెక్కులు, రామగిరి మండలానికి సీఎంఆర్ఎఫ్-35, కల్యాణ లక్ష్మి-28 చెక్కులు, మంజూరు చేసి ఇప్పించారు. మంథని నియోజకవర్గంలోని పలు ఆస్పత్రిలలో అనారోగ్యంతో చికిత్స పొంది సహాయం కొరకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వీరికి ప్రభుత్వం నుండి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేపించారు.ఈ చెక్కులను మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు  వ్యక్తిగత (పిఏ) సహాయకులు ఆకుల చంద్రశేఖర్ వారి గ్రామానికి వెళ్లి వారి ఇంటి వద్ద ఈ చెక్కులు అందజేశారు.