పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) అరుణ శ్రీ

అగ్నిధారన్యూస్,( రామగుండం)  అబివృద్ది పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) అరుణ శ్రీ ఇంజనీరింగ్ అధికారులను,కాంట్రాక్టర్ లను ఆదేశించారు. సోమవారం ఉదయo రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్ లలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. మార్కండేయ కాలనీలో పెద్ద కాలువ నిర్మాణ పనులు , దుర్గా నగర్ లో పూర్తయిన సి సి రోడ్డు పనులు , ప్యాచ్ వర్కులు , గౌతమి నగర్ నుండి ఎఫ్ సి ఐ క్రాస్ రోడ్స్ వరకు జరుగుతున్న మీడియన్ నిర్మాణ పనులు , ఖాజీపల్లి లో భూ గర్భ మురుగునీటి కాలువ నిర్మాణ పనులు, సప్తగిరి కాలనీలో పూర్తయిన సి సి రోడ్డు ను పరిశీలించారు . రాజీవ్ రహదారి వెంబడి వైద్య కళాశాల సమీపంలో ఎన్ పి డి సి ఎల్ సంస్థ వేసిన విద్యుత్ స్థంబం కారణంగా ఏర్పడిన నీటి సరఫరా పైప్ లైన్ లీకేజీ ని పరిశీలించారు. ఈ సంధర్భంగా నగర పాలక సంస్థ ఇ ఇ రామన్ , డి ఇ జమీల్ అహ్మద్ , ఎ ఇ షోయమ్ మీర్ తదితరులు ఉన్నారు.