oplus_0

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి

హైదరాబాద్ నగరంలో సదర్ పండగ అంటే తెలియని వాళ్లు ఉండరు. భాగ్యనగరంలో దాదాపు 200 ఏళ్లకు పూర్వమే ఈ సదర్ వేడుకలు యాదవులు నిర్వహించారని కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. హైదరాబాదులో సదర్ ఉత్సవం ఎంతో ప్రాచర్యం పొందింది. దీపావళి పండుగ తర్వాత రెండో రోజు యాదవులు సదరు ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ముర్ర జాతికి చెందిన దున్నలను హర్యానా, పంజాబ్, కురుక్షేత్ర, లాంటి ప్రాంతాల తీసుకువస్తారు. ముఖ్యంగా సదరుకు ఉత్సవాలకు ఉపయోగించే దున్నలు ఐదు రకాలుగా ఉంటాయి. రుస్తుం, మహారాజా, యువరాజా, ట్రంప్ దూడ, షేహేన్ షా, వీటి నిర్వహణ చాలా ఖరీదైనది. వీటికి ప్రతిరోజు దాదాపు 50 లీటర్ల పాలు, వందలాది ఆపిల్స్, బాదం, పిస్తా, ఫ్రూట్స్, వైన్, విస్కీ, లాంటి ఖరీదైన ఆహారాన్ని ఇస్తామని వీటి నిర్వాహకులు తెలిపారు. సదరు ఉత్సవాల సమయంలో ఉత్సవాలకు సన్నద్ధం కావడానికి వాటిని రకరకాలుగా తీర్చిదిద్దుతారు. దున్నలతో యువకులు పోటీపడి ఆటాడిస్తారు. హైదరాబాద్ కి పరిమితమైన సదర్ ఉత్సవం నేడు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనతో అన్ని జిల్లాలకు విస్తరించనుంది. ఇందులో భాగంగా ఆదివారం రోజు పెద్దపల్లి కేంద్రంలోని స్థానిక జండా చౌరస్తా వద్ద అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన వందలాది మంది ప్రజల మధ్య దున్నపోతుల నాట్యం అందరిని ఆకర్షించింది. సదర్ ఉత్సవం చూడాలనే ఉత్సాహం, జిల్లాలో మొదటిసారి సదరు ఉత్సవం నిర్వహించడం చేత భారీగా జనం తరలివచ్చారు. పోలీసుల పర్యవేక్షణలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తోపాటు,యాదవ సంఘం నాయకులు గంట రాములు యాదవ్ ,తమ్మడ బోయిన ఓదెలు యాదవ్, తిరుపతి యాదవ్, అట్ల సాగర్ యాదవ్, శ్రీహరి యాదవ్,రాజo మహంత కృష్ణ యాదవ్ అడ్వకేట్ రమేష్ యాదవ్ నాగరాజ్ యాదవ్ భాస్కర్ యాదవ్, , నాగరాజు యాదవ్, రాజేందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.