నీటిపారుదల శాఖ అధికారి ఏఈ నర్సింగరావు…

కాంట్రాక్టర్ వద్ద 20వేలు లంచం తీసుకుంటూ పట్టుకున్న అధికారులు…

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారుల దాడులు సంచనాలు సృష్టిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అంతర్గాo తహసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు మరువకముందే, పెద్దపల్లి కలెక్టర్ కేంద్రానికి కూతవేటు దూరంలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న మరో అధికారి సోమవారం రోజు ఏసీబీ అధికారులకు చిక్కడం సంచలనంగా మారింది. చర్చనీయాంశం అవుతుంది. వివరాల్లోకి వెళ్తే…ఎస్సారెస్పీ నీటిపారుదుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావు, ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన శ్రీనివాస్ యాదవ్ వద్ద నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ వద్దనుoడి బరితెగించి నడిరోడ్డు పైన డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం తను పనిచేసే నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుకు తీసుకువచ్చి విచారిస్తున్నారు.

Oplus_0

ఈ సందర్భంగా బాధితులు శ్రీనివాస్ మాట్లాడుతూ కొద్ది రోజల క్రితం జూలపల్లి మండలం కాచాపూర్ లో ఒక కాంట్రాక్ట్ పని 90 వేల విలువచేసేది పూర్తయ్యాక అందులో సగం డబ్బులు నాకు ఇస్తేనే బిల్లు పెడతానని అధికారి బిల్లు పెట్టకుండా ఇబ్బందులకు చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారని బాధితుడు తెలపారు.