అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లి గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేటకు చెందిన ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట నుండి కాలేశ్వరం దేవాలయానికి దర్శనార్థం కారులో ఉన్న వెళుతుండగా కాట్నపల్లి గ్రామం వద్ద కల్వర్టును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందాగా మరొకరు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ వారిని కరీంనగర్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

