= స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
= మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
అగ్నిధార న్యూస్,( రామగుండం): ఎన్టీపీసీ స్టేజ్ -2 ప్లాంట్ విస్తరణలో ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ కోరారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినతి పత్రం అందించారు.
అనంతరం కోరుకంటి చందర్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎర్పాటు కోసం గతంలో 10 వేల ఎకరాలు సేకరించిందని… మళ్ళీ 600 ఎకరాలు భూసేకరణ చేస్తున్నదన్నారు. గత పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు ఇప్పుడు తేడా ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ పహారా నడుమ ప్రజ అభిప్రాయ సేకరణ నడుస్తుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ప్రభావిత ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. బద్రిపల్లి, మల్యాలపల్లి, యాష్ ప్లాంట్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పోలీస్ కమిషనరేట్ పక్కన ఖాళీ స్థలం లో ప్రభావిత గ్రామాల ప్రజలను తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్, నారాయణదాసు మారుతి, నూతి తిరుపతి, ఇరుగురాళ్ల శ్రావణ్, వడ్లకొండ మహేందర్, పాల్గొన్నారు.


