Oplus_131072

ఎస్ ఐ స్వయంగా వాహనం నడిపినట్లు తెలుస్తోంది

అగ్నిధారన్యూస్ జగిత్యాల 

మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా క్రైమ్ రికార్డు బ్యూరో లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్వేత మృతి చెందారు. వివరాల్లోకి వెళితే గొల్లపల్లి మండలం సిల్వకోడూరు సమీపంలో కార్లో వెళ్తుండగా బైకును తప్పించబోయే చెట్టును ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈమె స్వయంగా వాహనం నడిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈమె గతంలో పెగడపల్లి కథలాపూర్ వెలగటూరు కోరుట్ల పోలీస్ స్టేషన్లో పనిచేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఎస్సై మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.