పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, మే-31:
జిల్లాలో పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో అధికారులుఅందరు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎవరైనా అక్రమ రవాణా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 7 న బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులు, కోడె దూడలను అక్రమంగా తరలించకుండా జిల్లాలో 3 చెక్ పోస్ట్ లను బసంత్ నగర్ దుబ్బపల్లి, గుంపుల వద్ద ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా చెక్ పోస్ట్ లలో విధులు నిర్వహిస్తున్నారని , ఈ చెక్ పోస్టుల 24 గంటల పాటు పనిచేస్తాయని అవసరమైతే మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పశువుల తరలించే వాహనం, వాహన డ్రైవర్ వివరాలు కొన్న వారి అమ్మిన వారి వివరాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారనే వివరాలను అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. పశువుల మార్కెట్ (సంత)లో కూడా పశువులను కొనడం కానీ అమ్మడం కానీ చేయడం వెంటనే నిలిపివేయాలని, బక్రీద్ పండుగకు అక్రమంగా ఆవులు, ఎద్దులు, దూడలను, రవాణా అడ్డుకోవడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

