Oplus_131072

అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి): మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు   భారత పాలకవర్గాల కిరాయి సైన్యం చేతిలో చిక్కి మరణించడం..ప్రపంచ కార్మిక వర్గానికి  తీరని నష్టం అని ప్రజాస్వామిక ఉద్యమకారుడు ఎరుకల రాజన్న గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  నిరంతరం కామ్రేడ్ నంబాల కేశవరావు అనుక్షణం భారత కార్మిక కర్షక  ఆదివాసి దళితుల మహిళల  ముస్లిం మైనార్టీ పేద ప్రజల ఓసి వర్గం  వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం మధ్యతరగతి విద్యార్థి వర్గం కోసం  50 సంవత్సరాలు భారత దీర్ఘకాలిక సాయుధ  నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసం ఉద్యమంలో అలుపెరుగని  పోరాటాలు చేశారని అన్నారు. నమ్మిన ఆశయాల కోసం భారత ప్రజలకు ప్రపంచ  శ్రామిక వర్గానికి ఇచ్చిన మాట మేరకు  యుద్ధభూమిలో అమరుడైన వీరుడికి  ప్రపంచ అశేష ప్రజల అనాధల తరపున జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. నేడు అస్తమించిన సూర్యకిరణాలు…రేపు ఉదయిస్తాయి అనే మాట ఎంత నిజమో  కామ్రేడ్ అమరుడు నంబాల కేశవ రావు  ఆశయం విప్లవం కమ్యూనిజం విజయవంతం కావడం కూడా అంతే నిజం  అని తెలిపారు.భారత అమరవీరులు కలలు కన్నా నూతన ప్రజాస్వామిక విప్లవం సోషలిజం  ! అంతిమంగా కమ్యూనిజం  ప్రస్తుతం అది విజయవంతం కాకుండా ఆగిపోయిన  అమరవీరుల త్యాగాల ప్రభావం  సిద్ధాంతం ఆచరణ నిజాయితీ   భారతదేశంలో  ప్రతి పేదవాడి గ్రామాన్ని ప్రభావితం చేసిందన్నారు. ఈ అంశం రేపు జరగబోయే  భారత నూతన విప్లవ సంగ్రామానికి  చాలా చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.