నూతన వధూవరులను ఆశీర్వదించిన , స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్,జిల్లా ఉన్నతాధికారులు.

61, 800 రూపాయల చెక్ అందించిన టీఎన్జీవో సంఘం అధ్యక్షులు బొంకూర్ శంకర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష.

పెళ్లి వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, మే-21:

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో తలపెట్టిన మానస- రాజేష్ ల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది.
తబిత బాలల సంరక్షణ సంస్థ పుత్రిక యన్.మానస, రేణుక యాకయ్య, ఏకైక పుత్రుడు యమ్. రాజేష్ కళ్యాణం బుధవారం రోజున ఉదయం 11 గంటల 5 నిమిషాల సుముహూర్తం నాడు ఘనంగా జరిగింది.
ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, డిసిపి కరుణాకర్, అదనపు కలెక్టర్ డి.వేణు టి ఎన్ జి ఓ అధ్యక్షులు బొంకురి శంకర్ .జిల్లా ఉన్నతాధికారులు అధికారులు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నేడు పెళ్లి చేసుకుంటున్నా నూతన వధూవరుల కోసం జిల్లాలోని టీఎన్జీవో సంఘం సేకరించిన 61 వేల 800 రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.