పెద్దపల్లి ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ కె నాగేశ్వర్ రావు.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, మే -31:

వివిధ కేసులలో పట్టుబడిన 10 వాహనాలను జూన్ 4న ఉదయం 11 గంటలకు పెద్దపల్లి ఎక్సైజ్ స్టేషన్ బండారికుంటలో వేలం వేస్తున్నట్లు పెద్దపల్లి ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ కె నాగేశ్వర్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

వేలం వేయు వాహనాలలో టివిఎస్ స్టార్ సిటీ, టాటా సుమో, టి.వి.ఎస్ ఎక్సెల్, హీరో గ్లామర్, హోండా యాక్టివా, హోండా షైన్ వాహనాలు రోడ్డు వర్త్ కండిషన్లో, హీరో హోండా ప్యాషన్ ప్లస్, హోండా ప్యాషన్ ప్లస్, టీవీఎస్ ఎక్సెల్, టీవీఎస్ సుజుకి మ్యాక్స్ వంటి వాహనాలు స్క్రాప్ కండిషన్ లో ఉన్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు  జూన్ 4న ఉదయం 10 గంటల లోగా ధరావతు డబ్బులు డిపాజిట్ చేసి రసీదు తీసుకోవాలని, బహిరంగ వేలం జూన్ 4న ఉదయం 11 గంటలకు జరుగుతుందని , మరిన్ని వివరాలకు కార్యాలయ పని వేళలో ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని పెద్దపల్లి ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ కె నాగేశ్వర్ రావు  ఆ ప్రకటనలో పేర్కొన్నారు.