అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం విత్తు కొద్ది పంట” కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతులకు విత్తనాలను పంపిణి కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఘనంగా ప్రారంభించారు.
ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ……
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం పరిశోధన స్థానం నుండి తయారు చేయబడిన వరి రకాలను ప్రతి ఒక్క రెవెన్యూ గ్రామం లో ముగ్గురు చొప్పున అభ్యుదయ రైతులను గుర్తించి వారికి నాణ్యమైన విత్తనాలు అందజేయడం ద్వారా నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి పంట దిగుబడిని సాధించి ఇతర రైతులకు విత్తనాన్ని పంపిణీ చేయడం వలన రైతులు నాణ్యమైన విత్తనాలు పొంది అధిక దిగుబడులు పొందుటకు వీలుతోపాటు విత్తనాలపై చెల్లించేఅధికఖర్చునునివారించవచ్చనీఅదేవిధంగా రైతులు ముందస్తు వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవడం వలన అధిక దిగుబడులు పొందడమే పాటు పకృతి వైపరీత్యాలనుండి తట్టుకొని రైతు లబ్ధి పొందటానికి అవకాశం ఉంటుందని వివరించారు రైతులు రోహిణి కార్తిలో వరి నార్లు పోసుకోవడం ద్వారా నార్లు బలంగా పెరిగి చిడపీడలను తట్టుకొని ముందుగా పంట చేతికి వస్తుందని వివరించారు. నవంబర్లోని అనురాధ కార్తిలో నార్లు పోసుకోవడం ద్వారా రైతులు పకృతి వైపరీత్యాలనుండి కొడగండ్ల వాన నుండి తప్పించుకొని అధిక దిగబడులు పండుటకు అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు .పద్మ .రాజు .ప్రశాంతు .రవితేజ .స్వప్న .సౌమ్య వివిధ గ్రామాల రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
