విద్యారంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ నీ గద్దె దింపుతాం.
ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి,హన్మకొండ ఎంఈఓ కి వినతి.
ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భాను ప్రసాద్ డిమాండ్.
అగ్నిధారన్యూస్ హనుమకొండ
జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా తిరిగి విద్యా సంవత్సరం పు:న ప్రారంభం కానున్నప్పటికీ హనుమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు మాత్రం నేటికీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని
ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భాను ప్రసాద్ అన్నారు.
కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విద్యాశాఖ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భాను ప్రసాద్ మాట్లాడుతూ….
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఆచరణలో మాత్రం అడుగు అడుగు ముందుకు వెయ్యడం లేదని విమర్శించారు.. మండల కేంద్రంలో మరమ్మతులకి నోచుకోలేని పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ ఇలా సబ్జెక్టు అనుగుణంగా పాఠశాలలో టీచర్స్ లేరని.. దానివల్ల విద్యార్థులు విద్య పరంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. మండల కేంద్రంలో మర్కాజి, ఎల్ బి హెచ్ ఎస్, ప్రాక్టీసింగ్ లాంటి పేరు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కరువయ్యాయని వాటిపై దృష్టి సారించి తక్షణం జిల్లా విద్యాధికారి స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరికొన్ని పాఠశాలలో కిటికీలకు జాలీలు , వాటర్ సదుపాయం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాష్రూమ్స్, లేని కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే దుర్మార్గమైన పరిస్థితులు హన్మకొండ మండల కేంద్రంలో కొన్నిచోట్ల నెలకొంది అన్నారు. వాటిపై జిల్లా విద్యాధికారి దృష్టిసారించి పరిష్కరించాలని, ఈ విద్యా సంవత్సరం పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వం గ్రాండ్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు బొజ్జు జ్యోతి పాల్గొన్నారు.
