అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాతూర్ పర్యవేక్షించినారు. స్పెషల్ ట్రైన్లో పెద్దపల్లికి వచ్చిన జిఎం పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి స్టేషన్లో జరుగుతున్న పనులను పూర్తిస్థాయిలో పరిశీలించలేకపోయారు. అనంతరం రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే బోర్డు మెంబర్ ఎన్ డి తివారి జిఎంకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ప్రజల సౌకర్యార్థం పెద్దపల్లిలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలంటూ వినతిపత్రం అందించారు. అందుకు జిఎం సానుకూలంగా స్పందించారని తివారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఎం, రైల్వే సిబ్బంది, తో పాటు నందకిషోర్ అటల్ విష్ణు మాలిని తదితరులు పాల్గొన్నారు.
