మూడవ రోజు కొనసాగుతున్న ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు.

ప్రజలందరు ఉచిత కంటి వైద్య శిబిరం సేవలు సద్వినియోగం చేసుకోవాలి.

700 మందికి పైగా శిబిరాన్ని సందర్శించగా550 పైగా కంటి పరీక్షలు.

350 పైగా ఉచిత కంటి అద్దాల పంపిణి ,30 మంది కంటి శుక్లాల సర్జరీలకి ఎంపిక.

టాస్క్ సి ఓ ఓ ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)

కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని సి కె ఆర్ ఫంక్షన్ హాల్ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ…, కల్వకుర్తి మరియు పరిసర ప్రాంత ప్రజలందరు కల్వకుర్తి పట్టణ కేంద్రంలో అందరికి అందుబాటులో,అనుగుణంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిభిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని,కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన వాళ్ళందరికి కూడ కంటి శాస్ర చికిత్స గురించి అవగాహన కల్పిస్తు,కంటి వైద్య శిభిరం అవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేల ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ, సుమారుగా 700 మందికి పైగా ఉచిత కంటి వైద్య శిభిరాన్ని సందర్శించగా,550 కి పైగా కంటి పరీక్షలు నిర్వహించామని, వారిలో 350 మందికి ఉచిత కంటి అద్దాల పంపిణి చేశామని,

కంటి శుక్లాల సర్జరీకి 30 మందికి పైగా పేషెంట్లు

కంటి శుక్లాల సర్జరీకి ఎంపిక వారికి రేపటి నుండి సర్జరీల ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు,యూసఫ్ బాబా,మల్లయ్య,గణేష్,శ్రీపతి,శేఖర్,రవి,యాదయ్య,శ్రీను, నాగిళ్ల శివ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు..