– ఇక నుంచి గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ – కార్టన్ సెర్చ్ లు.
– దొంగతనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు.
– మంథని సీఐ బి.రాజు.
అగ్నిధారన్యూస్ మంథని :
పట్టణాలలో , గ్రామాలలో రోజు రోజుకు దొంగతనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూడు అదే మాట. గ్రామాలలో అయితే ఎప్పుడూ ఏం జరుగుతుందో అని భయంతో రాత్రి వేళలో వృద్దులు సరిగ్గా నిద్రించడం లేరు కూడా.గత నెల 17న పెద్దపల్లి జిల్లా మంథని మండలం ధర్మారం (గద్దలపల్లి) గ్రామంలో కందుకూరి లక్ష్మి ఇంట్లో చొరబడి పుస్తెలతాడు దొంగతనం చేసిన దొంగలను అరెస్టు చేసి సోమవారం విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. వీరిని రిమాండ్ కు తరలిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ.. ధర్మారం గ్రామంలో జరిగిన దొంగతనంలో అదే గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు రాయినేని మల్లయ్య, రాయినేని అనిల్ జూన్ 17 రాత్రి మూడు గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మి ఇంటి కరెంటును కట్ చేసి తలుపులు ఊడ తీసి ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. వృద్ధురాలి చాతి పై కాలు వేసి పుస్తెలతాడు తెంపుకొని పారిపోయారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పరిశోధించగా అంబర్ ప్యాకెట్ ఆధారంగా దొంగలను గుర్తించామని అన్నారు. అలాగే పుట్టపాక లో జరిగిన ట్రాక్టర్ దొంగతనం, సుందిళ్ల పంప్ హౌస్ వద్ద జరిగిన ఇనుపరాడ్స్ దొంగతనం, మంథని పెట్రోల్ పంపు వద్ద జరిగిన బైక్ దొంగతనం, మంథని వాసవి నగర్ లో జరిగిన దొంగతనం కేసులను త్వరితగతిన చేదించామని సీఐ తెలిపారు. అలాగే రామగిరి మండలంలో జరిగిన రెండు ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం, ఒక పగటి దొంగతనం కేసులను ఛేదించి దొంగతనాలు చేసిన వారిని కూడా గతంలో అరెస్టు చేశామని తెలిపారు. దొంగతనాలను అరికట్టేందుకు ఒక కొత్త టీంను ఫామ్ చేశామని అన్నారు. బ్లూ కోర్ట్, పెట్రోలింగ్ ముమ్మరం చేశామని తెలిపారు. ఐడి పార్టీని కూడా అప్రమత్తం చేశామని అన్నారు. ఇకనుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గ్రామాలలో కార్టన్ సెర్చ్ నిర్వహిస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మంథని సీఐ బి. రాజుతోపాటు మంథని ఎస్సై డేగ రమేష్, ముత్తారం ఎస్సై నరేష్, రామగిరి ఎస్సై శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
