Oplus_131072

మట్టి తరలింపు ద్వారా 2 కోట్ల 47 లక్షల99 వేల 500 ఆదాయం..

5 మండలాలో 2కోట్ల 44 లక్షలతో 23 అభివృద్ధి పనులు.

చెరువులలో మట్టి తరలింపు పై పత్రికా ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, జూలై -02 :మట్టి తరలింపు ద్వారా 2 కోట్ల 47 లక్షల 99 వేల500 ఆదాయం వచ్చిందని సంబంధిత మండలాల్లో రోడ్లు పాఠశాలల అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం జరుగుతుందని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.పెద్దపల్లి జిల్లాలోని చెరువుల నుంచి ఇప్పటి వరకు 9 వేల 185 లారీ టిప్పర్ మట్టి తరలింపు ద్వారా 2 కోట్ల 47 లక్షల 99 వేల 500 రూపాయల ఆదాయం లభించిందని అన్నారు.పెద్దపల్లి మండలంలోని చేతికుంట చెరువు, కల్పా చెరువు ద్వారా 330 లారీ ట్రాక్టర్ టిప్పర్, సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామం షాంగై కుంట ద్వారా 71 లారీ టిప్పర్ ట్రిప్పులు, శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ చెరువు ద్వారా 1575 లారీ,టిప్పర్ ట్రిప్పులు, ఓదెల మండలం లోని కొలనూరు గ్రామంలోని అప్పమాయ చెరువు ద్వారా 2125 లారీ,టిప్పర్ ట్రిప్పులు, అలిమయ చెరువు ద్వారా 3713టిప్పర్ ట్రిప్పులు, పెందుర్తి గ్రామంలోని ఊర చెరువు ద్వారా 1191 లారీ,టిప్పర్ ట్రిప్పులు, మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని రెడ్డి చెరువు ద్వారా 180 టిప్పర్ ట్రిప్పులు మొత్తం 9185 టిప్పర్ ట్రిప్పులు మట్టి తరలించమని అన్నారు. మట్టి తరలింపు ద్వారా లభించిన ఆదాయంలో 2 కోట్ల 44 లక్షల రూపాయలతో మంథని, ఓదెల, పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలంలో అంతర్గత సిసి రోడ్లు,  ప్రభుత్వ పాఠశాల మరమ్మత్తు పనులకు, కేజిబీవీ లో  అదనపు  సౌకర్యం కల్పనకు వినియోగించడం జరిగిందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.