పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. 

ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.

నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తాం. 

ప్రజాప్రయోజనాలు ముఖ్యం.

తనిఖీలు కొనసాగుతాయి.

32 వేల రూపాయలు జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు.

పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లిటౌన్:రాబోయే వర్షాకాలం దృష్ట్యా ప్రజా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్ అధికారులు  పెద్దపల్లి పట్టణంలోని  బార్ & రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని నిబంధనలు పాటించని రెస్టారెంట్లకు 32 వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ మాట్లాడుతూ… పెద్దపల్లి పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్ , హోటల్ యజమానులు పట్టణ ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కుల్లిపోయిన ఆహార పదార్థాలను విక్రయించనట్లయితే జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. నిబంధనల అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వర్షాకాలం దృష్ట్యా  కిచెన్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అలాగే త్వరలో పెద్దపల్లి పట్టణంలోని అన్ని హోటల్,ఫాస్ట్ ఫుడ్ సెంటర్,బార్ అండ్ రెస్టారెంట్లు  టిఫిన్ సెంటర్ల  యజమానులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్,వార్డ్ ఆఫీసర్లు అనిల్, ప్రదీప్,శ్రీనివాస్, సుధీర్,సాగర్,అరవింద్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.