అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ క్రైమ్
ఫోక్సో, కిడ్నాప్, రేప్ కేసులో ఫోన్ నిండుతుడికి పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి కే సునిత 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్లు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఫిర్యాదుదారు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని సుల్తానాబాద్ కు చెందిననిందితుడు షేక్అన్వర్ 25 సంవత్సరాలు కాగజ్ నగర్ కు తన బంధువుల ఇంటికి తీసుకువెళ్లి శారీరకంగా చాలాసార్లు అనుభవించాడు. ఆమె పలుమార్లు పెళ్లి చేసుకోమని అడగగా చాలాసార్లు మాటదాటీవేయడంతో ఆమె తన తల్లి కి చెప్పడంతో తన తల్లి సహాయంతో 2018 అప్పటి ఎస్సై కే రాజేష్, కేసు నమోదు చేసి అప్పటి ఏసీపి హబీబ్ ఖాన్ నేరుస్తున్నీ అరెస్టు చేసి జూడిషనల్ రిమాండ్ పంపించడం జరిగింది. కేసును పరిశీలించిన పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్ జడ్జి మంగళవారం రోజున వీరీ ఇరువురి వాదనలు విన్న అనంతరం నేరం రుజువు కావడంతో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగిందని సుల్తానాబాద్ ఎస్సై తెలిపారు. నేరస్తులను శిక్ష పడటానికి,ముఖ్యపాత్ర పోషించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాదం రమేష్ కు సాక్షులను ప్రవేశపెట్టడానికి సహకరించిన పెద్దపల్లి డిసిపి సి.కరుణాకర్, ఏసీపీ జీ.కృష్ణ, సుల్తానాబాద్ సీఐ.సుబ్బారెడ్డికి, కోర్టు కానిస్టేబుల్లకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అభినందనలు తెలిపారు.
