అగ్నిధార న్యూస్ మంథని:

ఆదివారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన స్వర్గీయ ఇందిరా గాంధీ గారి 37 వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మంథని మండల, అధ్యక్షులు సెగ్గం రాజేష్,  ఆధ్వర్యంలోనిర్వహించారు.
ఈ సందర్భంగా ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూగరీబీ హటావో అంటూ దేశంలో పేదరిక నిర్మూలన కోసం పని చేసిన తొలి మహిళా ప్రధాని
జాతీయ భద్రత ,ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానానికి చేసిన సేవలుపేదల పక్షపాతి బడుగుల ఆశాజ్యోతి
రాజభరనాలు రద్దుబ్యాంకులు జాతీయకరణ ,
అరిజన గిరిజనులకు భూమిపంపిణీ,బలహీనవర్గాలకు గృహ సముదాహిని,బడి ఈడు పిల్లలు చదువుకోవాలి
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.
ఇందిరా గాంధీ గారు మహిళ లోకానికి స్ఫూర్తి,
ఇందిరా గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత,దేశం ఇందిరా గాంధీ గారిని చూసి గర్వపడుతుంది అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశి భూషణ్ కాచే, ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి పెరవేని లింగయ్య యాదవ్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, మండల అధికార ప్రతినిధి తోకల మల్లేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్, మాజీ సర్పంచులు చంద్రు రాజమల్లు, నాగుల రాజయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగదీష్, కారంగుల తిరుపతి, అక్కపాక సదయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉట్ల అనిల్ రెడ్డి, ఆరేల్లి కిరణ్ గౌడ్ ఎరుకల రమేష్ బాబు, సాయి మోహన్ పెరవేణి రాజు యాదవ్, బూడిద రంజిత్, తదితరులు పాల్గొన్నారు