పెద్దపల్లి జిల్లా చిన్నకల్వల వద్ద బొలెరో వాహనం పల్టీ – తప్పిన పెను ప్రమాదం.
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ రూరల్
పెద్దపల్లి జిల్లా చిన్నకల్వల గ్రామ సమీపంలో బొలెరో వాహనం దాదాపు 5.30 ఉదయం పల్టీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. వాహనంలో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
గాయపడిన వారు మహారాష్ట్ర రాష్ట్రం చంద్రపూర్ జిల్లాకు చెందిన వారిగా తెలుస్తుంది. పొలం నాట్ల పనుల కోసం మహారాష్ట్ర నుంచి సుల్తానాబాద్‌కు వస్తున్న క్రమంలో చిన్నకల్వల వద్ద రోడ్డుపై బొలెరో అదుపు తప్పి పల్టీ కొట్టినట్లు తెలుస్తుంది.
అదే సమయంలో ఎదురు వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ఒకసారి వ్యవసాయ కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని జతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



