అద్దె భవనాల్లో బి ఎడ్ విద్య…..
కాగితాలకే పరిమితమైన కళాశాల
బోధన బరువు – విద్యార్థులు కరువు
నిబంధనలకు విరుద్దం – నిలకడలేని తరలింపు
నియంత్రించని అధికారులు – నియమాలు పాటించని యాజమాన్యం
ఉపాధ్యాయ విద్యపై విద్యాధికారుల బాధ్యత ఏమైంది?
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
ఉపాధ్యాయ వృత్తి ఒక నోబుల్ ప్రొఫెషన్. సమాజానికి దిశానిర్దేశం చేసే ఉపాధ్యాయులను తయారు చేయాల్సిన బాధ్యత గల శాతవాహన యూనివర్సిటీ పరిధిలో,జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా రెండు సంవత్సరాల ‘బిఈడి’ శిక్షణకు సంబంధించిన నిబంధనలు పాటించకుండా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మైనారిటీ బి.ఎడ్ కళాశాలలో చదువు అంగడి సరుకులా “బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్” తయారైన తీరు నేటి విద్యా వ్యవస్థకు దర్పణంగా ప్రశ్నార్ధకంగా మారింది.ఉపాధ్యాయ విద్యను నాణ్యతపరంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్న నిబంధనలు ఈ కళాశాలలో కాగితాలకే పరిమితమై ఉన్నాయా? లేక నిజంగా అమలవుతున్నాయా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతమున్న బిఈడి కళాశాలలు 2028 నాటికి మల్టీడిసిప్లినరీ సంస్థలుగా మారి.2030 నాటికి ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను ప్రారంభించాలిఅని, జాతీయ విద్యా మండలి స్పష్టంగా ఆదేశించినప్పటికీ, ఈ మార్పులకు సంబంధించిస్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతొ
మల్టీడిసిప్లినరీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్లలో మాత్రమే నిర్వహించాల్సి ఉండగా విశ్వవిద్యాలయం ఆ చర్యల దిశగా కొనసాగకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పెద్దపల్లి లోని క్రిసెంట్ మైనారిటీ బి.ఎడ్ కళాశాల విషయానికి వస్తే తరుచూ అద్దె భవనాల తరలింపులతో మొదటగా కరీంనగర్ నుంచి పెద్దపల్లి పట్టణంఖుద్రత్ నగర్‌లోని ఒక పాఠశాల భవనంలో నాలుగేళ్లు కొనసాగి,అకస్మాత్తుగా, 20 రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి మండల పరిధిలోని రాఘవపూర్ గ్రామ శివారుకు కళాశాలను తరలించడం భవనానికి గ్రామపంచాయతీ అనుమతి తీసుకోకపోవడం,గతంలో ఆ భవనానికి వేల రూపాయల బకాయిలు ఉన్నట్లు అగ్నిధార విచారణలో సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు తెలపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ప్రస్తుత కళాశాల భవనానికి పేరుతో కూడిన బోర్డు ప్రదర్శించకపోవడం,కనీస రవాణా సౌకర్యాలు లేకపోవడం,నిబంధనలను బేఖాతర్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు కళాశాలను మార్చుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. యాజమాన్యాన్ని ఇదే విషయమై అగ్నిధార ప్రతినిధి వివరణ కోరగా మాకు ఈ విద్యా సంవత్సరం 2025-26 అనుమతి రావడం జరిగింది, కాబట్టి రాబోయే విద్యా సంవత్సరం వరకు కళాశాల అనుమతుల కోసం ఎన్సీఈటీఈ ఇన్స్పెక్షన్కు వెళ్తామని చెప్పడం,విశ్వవిద్యాలయం యొక్క నియంత్రణ లేకుండా కళాశాల నడుస్తున్నట్టు స్పష్టమవుతున్నది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ వృత్తి విద్య నిర్వహించే కళాశాలలో మౌలిక వసతులుగా పరిపాలనా విభాగం,అకడమిక్ విభాగం ఇతర సదుపాయాలతో విద్యా సంవత్సరానికి 100 మంది చాత్రోపాధ్యాయులు గల యూనిట్ కు 3000 చదరపు మీటర్ల స్పష్టంగా గుర్తించబడిన స్థలంలో 2000 చదరపు మీటర్లు నిర్మిత విస్తీర్ణంగా ఉండి.మిగిలిన స్థలం ఆట స్థల అవసరాలకు ఉపయోగించాలి.
కనీసం ఆరు టాయిలెట్ బ్లాకులు,ఓపెన్ ఏరియాలో నాలుగు ట్యాపులతో ఒక సామూహిక చేతుల కడుక్కునే కేంద్రం ఏర్పాటు చేయాలి.బోధనా సదుపాయాలలో
కనీసంగా ఎనిమిది తరగతి గదులు ఉండాలి.ప్రతి తరగతి గది విస్తీర్ణం 500 చదరపు అడుగులు ఉండాలి.గ్రంథాలయంలో ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్లు,కనీసం 50 మందికి కూర్చునే సౌకర్యంతో 1000 శీర్షికలు మరియు 4000 పుస్తకాలు ఉండాలి.వీటిలో పాఠ్య పుస్తకాలు,రిఫరెన్స్ పుస్తకాలు,విద్యా ఎన్సైక్లోపీడియాలు, డిజిటల్ వనరులు కనీసం ఐదు పరిశోధనా జర్నల్స్ తో డిజిటల్ లైబ్రరీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.సైకాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ,మ్యాథమెటిక్స్, జువాలజీ,బోటనీ, జియోగ్రఫీ వంటి విషయాలకు తగిన పరికరాలతో కూడిన ప్రయోగశాలలు ఉండాలి.కార్యాచరణ వనరుల కేంద్రం బోధనా సామగ్రి తయారీ, క్రాఫ్ట్,విద్యా బొమ్మలు, అనుభవాత్మక అధ్యయనం ఐసీటీ ఆధారిత బోధన కోసం ఉపయోగించాలి. ఫోటోకాపీ యంత్రం, ఆడియో–వీడియో పరికరాలు,టీవీ,ప్రొజెక్టర్ ఉండాలి.ఇందులో కంప్యూటర్ భాషా ప్రయోగశాల తప్పనిసరి.ఆరోగ్య శారీరక విద్య కోసం ప్రత్యేక గది ఉండాలి. ఇండోర్ అవుట్‌డోర్ క్రీడా పరికరాలు,యోగా విద్యా సదుపాయాలు ఉండాలి.సంస్థలో కనీసం 200 మంది కూర్చునే సామర్థ్యంతో 2000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక మల్టీపర్పస్ హాల్ తో,సెమినార్లు వర్క్‌షాప్‌ల నిర్వహణకు అవసరమైన ఆడియో–విజువల్ సిస్టమ్ ఉండాలి.అధ్యాపకుల కోసం వ్యక్తిగత పని స్థలం, పనిచేసే కంప్యూటర్లు నిల్వ సదుపాయంతో పరిపాలనా కార్యాలయానికి తగిన పని స్థలం,ఫర్నిచర్,నిల్వ కంప్యూటర్ సదుపాయాలు అవసరం. కనీసం ఒక సామూహిక గదితో సరిపడా స్థలం,ఒక స్టోర్ రూమ్,సాధారణ దివ్యాంగులకు అనుకూలమైన ఫర్నిచర్,
సురక్షిత తాగునీటి సదుపాయం తప్పనిసరి.క్యాంపస్,నీటి సరఫరా,టాయిలెట్ సదుపాయాల శుభ్రతకు,ఫర్నిచర్,పరికరాల మరమ్మత్తు,మార్పిడికి సమర్థవంతమైన ఏర్పాట్లతో పాటు
వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు సోలార్ ప్యానెల్స్ వంటి పునరుత్పాదక శక్తి వనరుల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సూచించిన భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి.ఇంత స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ ఈ కళాశాలలో ఎక్కడ కానరాకపోవడం కాలేజీ ఇష్టారాజ్యంగా నడుస్తుండడం పర్యవేక్షించాల్సిన అధికారుల అసమర్ధతను తేటతెల్లం చేస్తుంది.ఉపాధ్యాయ విద్యా కోర్సును సమర్థవంతంగా అమలు చేయడానికి తప్పనిసరిగా పాఠశాల అకడమిక్,ఇంటర్న్‌షిప్,ప్రాక్టికమ్ కోసం ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి.ఈ పాఠశాలలు మొత్తం కోర్సు కాలంలో ప్రాక్టికమ్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా ఉండాలి. పాఠశాలల కేటాయింపులో జిల్లా విద్యా పరిపాలన భాగస్వామ్యం ఉండాలి. కానీ ఈ మైనార్టీ విద్య కళాశాలకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలల్లో అనుమతులు ఇవ్వడం, నిబంధనలను పట్టించుకోకపోవడం జిల్లా విద్యాశాఖ పనితీరు పట్ల పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ విద్య కోర్సు కోసం అవసరమైన పాఠ్య విభాగాల ప్రకారం,పీహెచ్డీతో ఎనిమిది సంవత్సరాల అనుభవం కలిగిన రెగ్యులర్ ప్రిన్సిపాల్ తో పాటు,15 మంది ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్,కంటెంట్-కమ్-పెడగాజీ,ఫిజికల్ ఎడ్యుకేషన్,ఆర్ట్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన నెట్/సెట్ అర్హత గల అధ్యాపకులను నియమించాలి.అలాగే పరిపాలనా,వృత్తిపరమైన సిబ్బందిలోఅసిస్టెంట్ లైబ్రేరియన్,కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్,లోయర్ డివిజన్ క్లర్క్,డేటా ఎంట్రీ ఆపరేటర్,మల్టీ-టాస్కింగ్ స్టాప్ ఉండాలి.జాతీయ విద్యా మండలి నిబంధనల ప్రకారం కళాశాల సిబ్బందికి జీతాలను ఆన్లైన్లో చెల్లించాల్సి ఉండగా, అలాంటివి ఏమి లేవు అనేది అగ్నిధారకు ఉన్న సమచారం. కళాశాల సిబ్బందిలొ ఇద్దరు నాన్ టీచింగ్,ఒక అర్హత లేని వారితో… మైనార్టీ ముసుగులో కళాశాల ఇష్టారాజ్యంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నూతన జాతీయ విద్యా విధానం – 2020 కు అనుగుణంగా నాణ్యమైన, పాఠశాల విద్యలో బోధించగల
నైపుణ్యంతో కూడిన,సమర్థ ఉపాధ్యాయులను రూపొందించడానికికోర్సు వ్యవధి4 సెమిస్టర్లతో మొత్తం రెండు విద్యా సంవత్సరాల్లోప్రతి సెమిస్టర్‌కుకనీసం 96 పని దినాలు,వారానికి 40 గంటల బోధనలోథియరీ 80%,స్కూల్ ఇంటర్న్‌షిప్ ప్రాక్టీస్‌కు 90% హాజరు ఉండాలి.ఈ కళాశాలలో 200 మంది ఛాత్రోపాధ్యాయులు ఉండగాఐదు నుండి పది శాతం లోపు మాత్రమే కళాశాలకు హాజరవుతున్నట్లు అగ్ని ధారకు ఉన్న సమాచారం. కళాశాల పనితీరుకు అద్దం పడుతుంది.
ప్రతి విద్యా సంవత్సరం రెగ్యులర్ కన్వీనర్ కోటాలో కళాశాల పేరు లేకపోవడంతో ఎస్ డబ్ల్యూ-2 కోటా కింద మైనార్టీ హోదాతో కళాశాలలోనే ప్రతి విద్యా సంవత్సరం 100 అడ్మిషన్లు కన్వీనర్,మేనేజ్మెంట్ కోటాలో ఇష్టం వచ్చినవారికి ప్రవేశాలు ఇవ్వడం,వారి వద్ద అటెండెన్స్,రికార్డులు, కాలేజీ అభివృద్ధి ఫీజుల పేరిట వసూళ్లు చేసి విద్యను వ్యాపార కేంద్రంగా మార్చిన యాజమాన్యంపై యూనివర్సిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం విస్మయానికి గురిచేస్తుంది.
కాగితాలకే పరిమితమైన నిబంధనలపై సమగ్ర విచారణ జరిపి,అన్ని నిబంధనలను పాటిస్తూ నడుస్తున్నట్లు తేలితే, ప్రజల్లో ఉన్న అపోహాలను నివృత్తి చేసినట్లవుతుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు నిర్ధారణ అయితే, కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధ్యాయ విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను ఇప్పటికైనా అడ్డుకోకపోతే, రాబోయే రోజుల్లో సమాజమే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నప్పటికీ,ఈ కళాశాలకు ఎలా అనుమతులు కొనసాగుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు మౌనం పాటించడం వెనుక ఆంతర్యమేంనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక అవినీతి ఏమైనా కుమ్మకై ఉందా? అనే ప్రశ్నలు బహిరంగంగా చర్చకు వస్తున్నాయి.
ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు భరోసా ఇస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. నిబంధనలు పాటించని కళాశాలలో చదివితే, భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెట్,డీఎస్సీ వంటి కీలక పరీక్షల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే సంబంధిత
కళాశాలపై సమగ్ర విచారణ చేపట్టి నిబంధనలు పాటిస్తున్నరా? లేదా అనే నిజాలను నిగ్గు తేల్చాల్సిన గురుతర బాధ్యత యూనివర్సిటీ అధికారులపై ఎంతైనా ఉంది.
ఈ మధ్యకాలంలోనే పెద్దపల్లి పట్టణ కేంద్రం నుండి క్రిసెంట్ మైనారిటీ బి.ఎడ్ కళాశాల రాఘవపురం గ్రామ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అన్ని అనుమతులతో విద్యాబోధన నిర్వహిస్తున్నాము. కళాశాల కరస్పాండెంట్ ఎంఏ నయీముద్దీన్


