అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
తన పెంపుడు కుక్కను కుటుంబంలో ఒకరిగా చూసుకునే శ్రీమాత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కాసర్ల రాజు ఆ మూగ జీవి ఆరోగ్యం కుదుటపడాలని మొక్కులు మొక్కి, ఆ కుక్క పేరిట నిలువెత్తు బంగారం (బంగారంలా భావించే బెల్లం) సమర్పించి సమ్మక్క సారక్క వన దేవతలకు మొక్కు తీర్చుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన ఆదివారం రోజున పెద్దపల్లి పట్టణంలో జరిగింది. శ్రీమాతా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కాసర్ల రాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క భైరవకు గత నెల సుస్తీ చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఏమి తినకుండా అస్వస్థకు గురైంది. ఆ సమయంలో అతనికి ఏమి తోచక సమ్మక్క సారక్క దేవతలకు మొక్కుకున్నాడు, కుక్క ఆరోగ్యం కుదుట పడితే జాతర సమయంలో నిలువెత్తు బంగారం సమర్పిస్తానని సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు మొక్కుకున్నాడు. మొక్కిన వెంటనే భైరవకు ఆరోగ్యం కుదుటపడింది. మొక్కు నెరవేరింది. కుక్కకు నిలువెత్తు బంగారం సమర్పించానని కాసర్ల రాజు తెలిపారు… మూగ జీవాల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎంఓ కోట మల్లేష్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, సభ్యులు బొడ్డు సుమన్ బొడ్డుపల్లి రవి, బండ రాజయ్య, కొమరిశెట్టి శ్రీనివాస్, ఓరుగంటి శ్రీధర్ సురేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.