– అధికార పార్టీ సహకరిస్తున్నదుకు వారికి బదిలీ ఉండదా?
– ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బదిలీ చెయ్యాలి
రాష్ట్ర ఎన్నికల ప్రాధానా అధికారికి రాసిన లేఖలో కోరిన మద్దెల దినేష్
అగ్నిధార న్యూస్ గోదావరిఖని టౌన్ జనవరి 24
రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ కి ఒక రూల్…రామగుండం కమిషనర్ కు ఒక రూలా..? లేక రూలింగ్ పార్టీ అండ ..నా?
పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రామగుండం నగర పాలక సంస్థ ఇంచార్జీ కమిషనర్ ను బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి కి రాసిన లేఖ లో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ కోరారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేస్తూ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) గా 2023 జూలై 22 న జిల్లాలో బాధ్యతలు తీసుకున్నారని , తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023 నవంబర్ 30న జరిగిన సందర్బంగా పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రామగుండం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. అట్టి ఎన్నికల సమయంలో సుమారు 200కు పైగా పోలింగ్ బూత్ లలో అధికారులు ఓటర్ల సౌకర్యార్థం కొన్ని కాంట్రాక్టు పద్ధతిన ఏర్పాటు చేసిన సౌకర్యాలకు సంబందించిన నిధులలో అవకతవకలు జరిగాయని సంభదించిన నిధులు మాయం అయ్యాయని అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణలో తదుపరి భారత సాధారణ ఎన్నికలు 18వ లోక్‌సభకు 17 మంది సభ్యులను ఎన్నుకునేందుకు 2023 మే 13న ఎన్నికలు జరిగాయని,పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా కూడా ఇట్టి అధికారి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గా వ్యవహరించడం జరిగిందని, ఇట్టి ఎన్నికలలో కూడ అధికారులకు, ఓటర్లకు సౌకర్యాలు కల్పించడంలో కాంట్రాక్టర్లకు పనులు అప్ప జెప్పితే నిధులు లెక్కలేవని, వాటిని ఇప్పటికి పనులు చేసిన వారికి నిధులు అందలేదని ఆరోపణలు అనేకం ఉన్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, తదనంతరం అదనపు కలెక్టర్ మరియు రామగుండం నగర పాలక సంస్థ ఇంచార్జీ కమిషనర్ గా వ్యవహారిస్తూ అధికారపార్టీ బలంతో అధికార పార్టీ నాయకురాలిగా చెలామణి అవుతూ తన వ్యవహరశైలిని మార్చుకోకుండా ముందుకు సాగుతుందని ఆయన ఆరోపించారు. రామగుండం నగర పాలక సంస్థకు కమీషనర్లు గా పనిచేస్తున్న అధికార్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అనేక రకాలుగా ఒత్తిడి చేయడం అలవాటుగా చేసుకొని
వారు ట్రాన్స్ఫర్లు పెట్టుకొని వెళ్లే విధంగా ప్రణాళిక చేసిందని ఆయన ఆరోపించారు. ఇక ఇదే అదనుగా భావించి ఇట్టి అదనపు కలెక్టరే రామగుండం నగర పాలక సంస్థకు ఇంచార్జీ కమిషనర్ గా 2024 సెప్టెంబర్ లో బాధ్యతలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఇంచార్జీ కమిషనర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి పూర్తి స్థాయిలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి విధేయురాలుగా ఉంటూ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి, వారి నాయకులకు, స్థానిక ఎమ్మెల్యే మాత్రమే పనులు చేసుకుంటూ అనధికారిక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా రామగుండం కార్పొరేషన్ లో కొనసాగుతుందని ఆయన ఆరోపించారు.రామగుండం నగర పాలక సంస్థలో పనులు చేస్తున్న సిబ్బందిని, కార్మికులను మానసికంగా కావాలనే నాన రకాలుగా ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుందని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్బంగా ఇట్టి అధికారిణి ఇంకా స్థానిక రామగుండం కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్ గా కొనసాగితే మాత్రం అధికార పార్టీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు తాను అధికారాన్ని అంతా ఉపయోగించి వారి పార్టీ నేతలకు అన్ని రకాలుగా అనుకూలంగా పనిచేస్తుందని, ఇప్పటికే రామగుండం కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్ లు ఉంటే ప్రభుత్వం 60 కి పెంచిందని అందులో భాగంగా డివిజన్ ల పునర్ విభజన లో భాగంగా అధికార పార్టీ నేతలకు అన్ని రకాలుగా వాళ్ళు చెప్పినట్లు డివిజన్ల పునర్ విభజన చేసారని ఆయన ఆరోపించారు. ముసాయిదా, ఫైనల్ ఓటర్ లిస్టును పూర్తిగా తప్పుల తడకగా, అసలు డివిజన్ లో పర్యటించకుండా కేవలం కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చొని అధికార పార్టీ నేతలు చెప్పినట్టు చేస్తున్న ఇంచార్జీ కమిషనర్ విధుల్లో చేరి రెండు ఏళ్ళు పూర్తి అయినప్పటికీ కూడా అధికార పార్టీ అండదండలతో ఇంకా (స్థానిక సంస్థల) అదనపు కలెక్టర్ గా రామగుండం నగర పాలక సంస్థ ఇంచార్జీ కమిషనర్ గా కొనసాగుతుందని, కనుక ఆ అధికారిణి ఇలాగే కొనసాగితే పెద్దపల్లి జిల్లాకే ప్రమాదంగా మారే అవకాశం ఉందని, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్ స్పందించి పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా, రామగుండం నగర పాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ గా కొనసాగుతున్న అధికారిని వెంటనే బదిలీ చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చూడాలని ఆయన ఎన్నికల ప్రధానాధికారికి రాసిన లేఖ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
