ఇంటి పన్ను డబ్బులు దుర్వినియోగం.
లెక్కలు చూపని 441248 రూపాయలు.
అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శి.
తీగ లాగితే డొంక కదిలేలా కార్యదర్శి వ్యవహారం.
సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపురం గ్రామపంచాయతీ కార్యదర్శి టి రవి ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి మండలం రాఘవపురం గ్రామ పంచాయతీ గ్రేడ్ ఫోర్త్ పంచాయతీ కార్యదర్శి టి రవి గ్రామంలో వసూలైన ఇంటి పన్నుల డబ్బులు 6,64,977 రూపాయలకు గాను, 223,729 రూపాయలు. మాత్రమే గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ ఖాతాలో జమ చేసి, 441248 రూపాయలు మొత్తాన్ని, నిబంధనలకు విరుద్ధంగా తన వద్ద ఉంచుకొని, అక్రమాలకు పాల్పడ్డట్లు గమనించడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల ఆదేశాలను పాటించని పంచాయతీ కార్యదర్శి పైన క్రమశిక్షణ చర్యలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శి రవిని టి ఎస్ సి ఎస్ (సిసి ఏ) నిబంధనలు 1991 నియమం 8(1) ఉపనియమం(1) ప్రకారంసస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ పూర్తయ్యేంతవరకు గ్రామం గాని మండలం గాని అనుమతి లేకుండా విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.
