అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కాల్వ శ్రీరాంపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఎం ప్రసాద్ ను కాల్వ శ్రీరాంపూర్ మండల పంచాయతీ అధికారి విచారణ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెండ్ చేస్తూ మంగళవారం ప్రొసీడింగ్ నెంబర్ a5/343 / 2016 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
పంచాయతీ కార్యదర్శి గ్రామంలోని, గృహాల పన్నుల వసూళ్లలో అవకతవకలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, ఇతర కారణాలవల్ల 1991 ఆంధ్రప్రదేశ్ నాటి సివిల్ సర్వీసెస్ వర్గీకరణ నియంత్రణ ఆపిల్ ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారు. కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగుతున్న, ఎం ప్రసాద్ 2025 26 ఆర్థిక సంవత్సరానికి, గ్రామపంచాయతీ నుండి 4,26,850 రూపాయలు ఇంటి పన్ను వసూలు చేసి, అందులో కేవలం 1,44,603 రూపాయలు మాత్రమే గ్రామపంచాయతీ సాధారణ నిధికి జమ చేసి, మిగిలిన 2,82,247 రూపాయలు మొత్తాన్ని తన వద్ద ఉంచుకొని నిబంధనలు పాటించకుండా దుర్వినియోగం చేశారనే ఆరోపణపై సస్పెన్షన్ కి గురి అయ్యారు సస్పెన్షన్ సమయంలో, గ్రామాన్ని, మండలాన్ని, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విడిచి వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
ధర్మారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్..
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ధర్మారం గ్రామ పంచాయతీకి చెందిన గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శి కె రవి ని ధర్మారం మండల అభివృద్ధి అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మారం మేజర్ గ్రామపంచాయతీలో వసూలు చేయాల్సిన ఇంటి పనులు 2025 26 ఆర్థిక సంవత్సరానికి 5,44928 డిమాండ్ ఉండగా దానికి బదులు కేవలం 6333 2 వీలు మాత్రమే ఇంటి పన్నులు వసూలు చేసి విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని పలుమార్లు డిమాండ్ పెంచాలని హెచ్చరించినప్పటికీ విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా వసూలు చేసిన గ్రామపంచాయతీ ఇంటి పన్ను పంచాయతీ జనరల్ ఫండ్ ఖాతాలో జమ చేయకుండా తన సొంత వాడుకున్నట్లు తేలింది. టి ఎస్ సి ఎస్ సిసిఏ నియమావళి 1991లోని నియమం ఎనిమిది ఉపనియమం 1 ప్రకారం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తరలు జారీ చేశారు సస్పెన్షన్ సమయంలో గ్రామాన్ని మండలాన్ని వదిలి వెళ్ళవద్దని ఉత్తర్వులలో ఆదేశించారు.
అవినీతి అక్రమాలపై ఒకే రోజు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు రాఘవపురం రవి ధర్మారం రవి కాల్వ శ్రీరాంపూర్ ప్రసాద్.. సస్పెన్షన్ కు గురి కావడంతో జిల్లాలో ఒక్కసారి సంచలనం సృష్టిస్తుంది.
