అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వివరాల్లోకి వెళితే… 15 వార్డులలో 12 వార్డులు కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్, ఫార్వర్డ్ బ్లాక్ ఒకటి గెలుపొందాయి. గెలిచిన వారి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి ఒకటవ వార్డు ఈర్ల స్వరూప కాంగ్రెస్, రెండవ వార్డు గాజుల రాజమల్లయ్య కాంగ్రెస్, మూడవ వార్డు కందునూరి సమత బిజెపి, నాలుగవ వార్డు బిరుదు కృష్ణ కాంగ్రెస్, ఐదవ వార్డు గరిగ శోభారాణి కాంగ్రెస్ , ఆరో వార్డు బాకం సాయికిరణ్ కాంగ్రెస్, ఏడవ వార్డు వరప్రసాద్ కాంగ్రెస్, ఎనిమిదవ వార్డు చింతల రాజు కాంగ్రెస్, 9వ వార్డు టీ కే ప్రభాకర్ కాంగ్రెస్, పదవ వార్డు అంతటి పుష్పలత కాంగ్రెస్, 11వ వార్డు కల్వల శంకరమ్మ బిఆర్ఎస్, 12వ వార్డు, అమిరిశెట్టి శ్రావణి ఏఐఎఫ్బి, 13వ వార్డు సిద్ధి తిరుపతి కాంగ్రెస్ 14వ వార్డు వేగోళం పద్మ కాంగ్రెస్, 15వ వార్డు, గాదాసు మంజుల కాంగ్రెస్ గెలుపొందారు.
