అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కొదురుపాక గ్రామానికి చెందిన కోదాటి సంపత్ రావు తాళం వేసిన ఇంట్లో దొంగతనాలు చేస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో 2019 సంవత్సరంలో తన ఇంటి ముందు ఉన్న తన పెద్దమ్మ అయినా కోదాటి చంద్రమ్మ ఇంట్లో ఒక్కతే ఉండడం గమనించి ఆమె మెడలో బంగారం గొలుసు ఉన్నది చూసి గొలుసును దొంగతనం చేయాలని దుర్బుద్ధితో పీఠతో చంద్రమ్మ తలపై కొట్టడంతో అక్కడే చనిపోవడంతో వెంటనే తన మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని ముద్దాయి సంపత్ రావు అక్కడినుండి పారిపోయాడు. నేరస్థునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని కొడుకు కొదటి రామారావు ఫిర్యాదు చేయగా అప్పటి సుల్తానాబాద్ ఎస్సై S రాజేష్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. నేర పరిశోధన పూర్తిచేసి చార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారు. ఇరువురి వాదనలు విన్న పెద్దపెల్లి జిల్లా జడ్జి K.సునీత నేరస్తుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో జీవితకాల కఠిన కారాగార శిక్ష,పదివేల రూపాయల జరిమానా విధించారు. శిక్ష పడడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవి సాక్షులను ప్రవేశపెట్టి తన వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేశారు. పెద్దపల్లి డిసిపి.B. రాoరెడ్డి, ఎసిపి G కృష్ణ పర్యవేక్షణ లో సాక్షులను ప్రవేశపెట్టడానికి సహకరించిన సుల్తానాబాద్ సీఐ G. సుబ్బారెడ్డి,ఎస్సైP.చంద్రకుమార్ కోర్ట్ కానిస్టేబుల్. P. శ్రీనివాస్, HC. పి.కోటేశ్వర రావు లను రామగుండం కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రాసిక్యూషన్ బృందానికీ అభినందనలు తెలిపారు.