అగ్నిధార న్యూస్ పెద్దపల్లి:

మూసివేసిన పాఠశాలను వెంటనే తెరిపించాలి విద్యా పరిరక్షణ కమిటీ సర్వే
ఎం.రఘు శంకర్ రెడ్డి విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకులు.

తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగం పట్ల పూర్తి నిర్లక్ష్యాన్ని ఉదాసీనతను ప్రదర్శిస్తుందని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకులు ఎం.రఘు శంకర్ రెడ్డి గారు విమర్శించారు. గత ఏడు సంవత్సరాలుగా విద్యారంగానికి నిధులు తగ్గిస్తూ 11 శాతం నుండి 6.46 శాతానికి దిగజార్చారు. అలాగే ప్రభుత్వ లెక్కల ప్రకారమే పంతొమ్మిది వేల ఐదు వందలు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి అయినా నియామకాలు చేపట్టడం లేదు కనీసం విద్యా వాలంటరీ లను కూడా నియమించడం లేదు ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2.5 లక్షల మంది విద్యార్థులు సంఖ్య పెరిగింది అయినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో కనీసం స్వచ్ఛ కార్మికులు కూడా నియమించలేదు
అలాగే పర్యవేక్షణ లేక వ్యవస్థ కుంటుపడింది 56 ఉప విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నవి. 592 ఎంఈఓ పోస్టులలో 574 పోస్టులు ఖాళీగా ఉన్నవి. కేవలం 18 మంది రెగ్యులర్ ఎం. ఈ. ఓ లతో పర్యవేక్షణ నడుస్తున్నది రాష్ట్రంలో 20 జిల్లాలో డీఈవో పోస్టులు కూడా మంజూరు కాని దుస్థితి ఉంది ఫలితంగా పర్యవేక్షణ వ్యవస్థ కుంటుపడింది
ఏడు సంవత్సరాలుగా పదోన్నతులు లేక మూడు వేల ప్రధానోపాధ్యాయ పోస్టులు, పదివేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ గా ఉన్నవి మరోవైపు పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదని , కొన్ని పాఠశాలలలో సంఖ్య లేదని సాకుతో మూసి వేస్తున్నారు గత నాలుగేళ్లుగా మూడు వేల పాఠశాలలు మూసివేశారు దీన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 11 మౌలానా అబ్దుల్ కలాం జయంతి నుండి జనవరి 3 2020 సావిత్రిబాయి పూలే జయంతి వరకు గ్రామాలలో వెళ్లి సర్వే నిర్వహించి తల్లిదండ్రులను కలిసి ఒత్తిడి తెచ్చి మూతపడిన పాఠశాల ను తెరవాలని డిమాండ్ చేయడం జరుగుతున్నది. పాఠశాల విద్యకు నిధులు పెంచాలని, ఉపాధ్యాయ నియామకాలు జరపాలని ,ప్రైవేటీకరణ , కార్పొరేటీకరణ అధుపుచేయాలని విద్యపరిరక్షన కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ఈ సందర్భంగా పెద్దపల్లి మండలం లోని మారేడిగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని దావన్న పల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్, ఎస్ ఎం సి కమిటీ సభ్యులు, గ్రామ యువత అంగన్వాడీ టీచర్, గ్రామ పెద్దలతో మాట్లాడడం జరిగింది ఈ గ్రామంలో లో పాఠశాలను 5 సంవత్సరాల క్రితం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారనే సాకుతో మూసి వేయడం జరిగింది ఈ పాఠశాల సంబంధించిన ఇద్దరు ఉపాధ్యాయులను మండలంలోని వేరే పాఠశాలకు డిప్యుటేషన్పై పంపడం జరిగింది. కానీ గ్రామస్తులు చెప్పినటువంటి వివరాల ప్రకారం గా గ్రామంలో పాఠశాలలో సరైన భౌతిక వస్తువులు కల్పించి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టినట్లయితే పాఠశాలకు 30 మంది విద్యార్థులను పంపిస్తామని తెలియజేయడం జరిగింది.కావున వెంటనే ఆ పాఠశాల లో భౌతిక వస్తువు కల్పించి వెంటనే పాఠశాలను తెరవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో డి.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.అశోక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీ పి. దామోదర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఏ.శ్రీనివాస్ డి.టి.ఎఫ్ జిల్లా కార్యదర్శి సరెందర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.క్రాంతి, జిల్లా కార్యదర్శి పి.ప్రవీణ్, కే. మమత డీటీఎఫ్ జిల్లా కౌన్సిలర్, రైతు సమస్యల సాధన సమితి జిల్లా అధ్యక్షులు ఎం. మల్లన్న కార్యదర్శి ఈ. రాజయ్య పేరెంట్స్ కమిటీ సభ్యులు పి సత్తెన్న వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.