అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి :వరిదాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడాలి.
సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రైతులు తమ వరిపంటను కోతలు కోసి ధాన్యాన్ని అమ్మడానికి కల్లాల్లో,కొనుగోలు కేంద్రాలను తరలించి సిద్ధంగా ఉన్నారని వాటిని వెనువెంటనే కొనుగోలు చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ కు వినతి పత్రం అందించారు.
సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై.యాకయ్య మాట్లాడుతూ ఇప్పటికే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పర్యటించామనిఅన్నారు. ఇప్పటివరకుప్రభుత్వం,మంత్రులు,ప్రజాప్రతినిధులు ,యంత్రాంగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటాలు చేయడం తప్పా జిల్లా లో మొతంగా ఇప్పటివరకు క్వింటాలు ధాన్యంకొన్న పాపానపోలేదని అన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.ఇదివరకే రాష్ట్రంలో చాలా చోట్ల అకాల వర్షాలు పడి నష్టపోతున్నారని కావున జిల్లా రైతాంగానికి అలాంటి పరిస్థితి రాకుండా వెంటనే ధాన్యాన్ని కొనుగోళ్లు ప్రారంభించి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం రైతాంగాన్ని నాశనం చేసే విధానాలు అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు.ఏసంగిలో వరి ధాన్యం కొనమంటూ స్వచ్ఛ వ్యవసాయాన్ని కార్పొరేట్ కబంధ హస్తాల్లో పెడ్తున్నాయని అన్నారు.వరి ధాన్యాన్ని కొనాల్సిన కేంద్రం నెపం రాష్ట్రాలపై మోపడం,రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాకు చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రైతాంగాన్ని కలుపుకొని కేంద్రం పై పోరాడాలని డిమాండ్ చేశారు.రైతులకు అన్యాయం చేయాలని చూస్తే సీపీఎం పార్టీ ఉరుకోదని రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో , జి.జ్యోతి,బత్తిని సంతోష్, కల్లెపల్లి అశోక్,మోదుపల్లి శ్రవణ్,జిల్లాల ప్రశాంత్,ఆది కృష్ణ,సిద్దార్థ,తదితరులు పాల్గొన్నారు.
