అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

పాఠశాల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి        విద్యార్థి సంఘ నాయకుడు బాలసాని క్రాంతి లెనిన్

పెద్దపల్లి మండలం లోని మారేడుగొండ గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ని మూసివేయడానికి విద్యాశాఖ అధికారులు నోటీసు ఇవ్వగా దాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘ నాయకుడు బాలసాని క్రాంతి లెనిన్  గ్రామానికి వెళ్లి గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రుల తో మాట్లాడి వారి అభిప్రాయలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను కార్పొరేట్ వ్యవస్థ గా  మార్చడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలను అక్కడ అక్కడ   మూసివేసి, రాబోయే రోజుల్లో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు విద్యను దూరం చేసే ప్రమాదముందన్నారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులును డిమాండ్ చేశారు.