అగ్నిధార న్యూస్, హైదరాబాద్:

 దేవనహళ్లి లో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కర్ణాటక రాష్ట్ర సమావేశం

ముఖ్య అతిథులుగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు, దేవనహళ్లి ఎమ్మెల్యే ఎన్ నారాయణ స్వామి, ఆర్ జె పి నేషనల్ ప్రెసిడెంట్ సంతోష్

కర్ణాటక, దేవనహళ్లి, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ని జాతీయ స్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లి ఆర్.వి ఫంక్షన్ హాల్ లో ఉదయం 11 గంటలకు కర్ణాటక రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ రాష్ట్ర సమావేశానికి ముఖ్య అతిథులుగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు, దేవనహళ్లి ఎమ్మెల్యే ఎన్. నారాయణ స్వామి, ఆర్.జె.పి నేషనల్ ప్రెసిడెంట్ సంతోష్ విచ్చేశారు..ఈ సమావేశం కర్ణాటక రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇటీవల కరోనా తో మరణించిన జర్నలిస్టులకు మరియు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు.. దైవ ప్రార్థన చేసిన తర్వాత, నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు చేతుల మీదగా జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి సభ ను ప్రారంభించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షుడిగా కర్ణాటక రాష్ట్ర ట్రెజరర్ తిప్పన్న వ్యవహరించారు.ముఖ్యఅతిథి దేవనహళ్లి శాసనసభ్యులు నిసర్గ నారాయణస్వామి మాట్లాడుతూ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్  రాష్ట్ర సమావేశం నా నియోజకవర్గమైన దేవనహళ్లి లో జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు.. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టులు ఫ్రంట్లైన్ వారియర్స్ గా సేవలు అందించడం చాలా అభినందనీయమన్నారు. జర్నలిస్టుల రాష్ట్ర సమావేశంలో తనను భాగస్వామిని చేసిన కర్ణాటక రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, జర్నలిస్టులకు అన్ని వేళలా అండగా ఉంటానని తెలియజేశారు.ఈ సమావేశంలో ఫౌండర్ మరియు నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు మాట్లాడుతూ అంద‌రి కంటే ఎక్కువ బాధ్య‌త విలేక‌రుల‌దే అని, తొలి ప‌త్రిక నుంచి ఇప్ప‌టిదాకా జ‌ర్న‌లిస్టులు నిర్వ‌హిస్తున్న బాధ్య‌త గురుత‌ర‌మైన‌దని, స్వాతంత్ర ఉద్య‌మానికి ఊపిరి పోసింది కూడా జ‌ర్న‌లిస్టులే అని, అనేక సంక్షోభ స‌మ‌యాల్లో పాత్రికేయుల కృషి విస్మ‌రించ‌లేనిదన్నారు. గ్లోబ‌లైజేష‌న్‌లో అన్నీ ప్రాంతాలు ఏక‌మైన స‌మ‌యాల్లో జ‌ర్న‌లిస్టుల ప‌రిజ్ఞానం విస్తృత‌మైనది. వీర‌జ‌వానుల త‌ర్వాత విలేక‌రుల‌నే అభినందించాలి. నిజాన్ని నిర్భ‌యంగా బ‌య‌ట‌పెట్టేది విలేక‌రులే. త‌మ బాధ్య‌త‌ల్ని గుర్తెరిగి హితోధికంగా ప‌నిచేయాలి. వారి క‌ష్టాన్ని గుర్తించి ప్ర‌భుత్వాలు వారికి అన్ని వ‌స‌తుల్ని స‌మకూర్చాలన్నారు. జర్నలిస్టులు చాలా సమస్యలతో దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.. జర్నలిస్టులు కు ఆర్థిక భరోసా ముఖ్యమని దీనికోసం జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన కోరారు.. అన్ని రాష్ట్రాలలోని జర్నలిస్టులందరిని కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని చట్టం చేయాలని సురేంద్ర బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆర్.జె.పి నేషనల్ ప్రెసిడెంట్ సంతోష్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతు ఎంత ముఖ్యమో, సరిహద్దులో పహారా కాస్తున్న సైనికుడి సేవలు ఎంత ముఖ్యమో, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వ్యవహరించే, ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే జర్నలిస్టుల సేవలు కూడా అంతే ముఖ్యమని ఆయన అభివర్ణించారు.ఎన్.ఎ.ఆర్.ఎ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణప్ప మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల పిల్ల‌ల‌కు కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య క‌ల్పించాల‌ని కోరారు..ఎన్.ఎ.ఆర్.ఎ కర్ణాటక రాష్ట్ర ఉపాధ్యక్షులు కబీర్ మాట్లాడుతూ అక్రిడేష‌న్‌తో సంబంధం లేకుండా జ‌ర్న‌లిస్టుల‌కు రైల్వే పాసులు, బస్ పాసులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు..ఎన్.ఎ.ఆర్.ఎ కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ జర్న‌లిస్టుల‌పై దాడులు జ‌రిగితే అవ‌త‌లివారిపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ తో కూడిన కఠిన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.ఎన్.ఎ.ఆర్.ఎ జనరల్ సెక్రటరీ మరియు నేషనల్ ఉమేన్స్ వింగ్ ప్రెసిడెంట్ మానస మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సంక్షేమ నిధి కేటాయించి, మహిళలు జర్నలిజం పై ఆసక్తి పెంచే ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో కొత్త సభ్యుల చేరిక, కర్ణాటక రాష్ట్ర కమిటీ నియామకం, రాష్ట్ర, జిల్లా కమిటీ లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది.. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి విలేఖరి కు కర్ణాటక రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గౌరవ సన్మానం జరిగింది.

ఈ సమావేశానికి కర్ణాటక లోని అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.