అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమురయ్య  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఉండి దేశాన్ని ఆర్థిక రంగంలో ముందుకు సాగేలా బాటలు వేసినాడు అన్నారు. రైతులకు ఉపయోగపడేలా  నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు దేశంలో ఎన్నో కట్టించినాడు. నెహ్రు గారికి చిన్న పిల్లలంటే ఎంతో ప్రేమ. మరియు దేశం కోసం వారి కుటుంబంలో ఇందిరా గాంధీ. రాజీవ్ గాంధీ. ప్రాణత్యాగాలు చేసినారు అన్నారు. సోనియా గాంధీ  తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది  సోనియాగాంధీ అన్నారు. రాబోయే కాలంలో రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి వచ్చేలా పోరాటాలు చేయాలని. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక క క సైనికుల్లా పనిచేయాలని కేంద్రo రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. నెహ్రు  అడుగుజాడల్లో ముందుకు నడవాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు. ఎండి సర్వర్ పాషా. వేముల రాజు. పేరుక సంతోష్. కమ్మర బోయిన రాజ్ కుమార్. గోశిక రాజేశం. ఎస్ డి ఫయాజ్. శ్రీనివాస్. మరియు కార్యకర్తలు పాల్గొన్నారు