అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారిని కలసి వినతి పత్రాన్ని అందించిన యాదవ సంఘం నాయకులు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వెంకట్రావ్ పల్లి (KK నగర్) గ్రామం ఇంటి నం.3-38/1 లో నివాసముంటున్న కీ.శే. గొడుగు కిష్టయ్య యాదవ్ మరియు గొడుగు లక్ష్మి యాదవ్. ఏకైక కుమార్తె కీ.శే. గొడుగు అంజలి యాదవ్ అదే గ్రామానికి చెందిన చాట్ల రాజు కుమార్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తూ తేది 09.11.2021 మంగళవారం రోజున వారి తల్లి లేని సమయంలో వారి ఇంట్లో(గుడిసె)కి చొరబడి నన్ను పెళ్ళి చేసుకోవాలి లేకపోతే నిన్ను చంపేస్తానని, ఆమె పెళ్ళికి నిరాకరించడంతో వెంబడి తీసుకు వచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి ఇంట్లో(గుడిసె) ఉన్న కత్తిపీటతో గొంతు కోసి చంపినాడు. తల్లి కూలీ పని చేసుకుంటూ కూతురిని చదివిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఆ తల్లి భాద్యత చూసుకునే కూతురు చంపి వేయబడడంతో ఆ తల్లి నిస్సహాయులైనది. ప్రేమోన్మాది చాట్ల రాజుకుమార్ ను చట్ట ప్రకారం కటినంగా శిక్షిస్తూ, గుంట భూమి కూడ లేని ఆ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకొని తగు న్యాయం చేయాలని,
ప్రేమోన్మాది నరహంతకుడు చాట్ల రాజ్ కుమార్ ను వెంటనే ఉరి తీయాలి.అంజలియాదవ్ కుటుంబములో ఒకరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అంజలియాదవ్ కుటుంబానికి 50 లక్షల పరిహారం వెంటనే అందించాలి.
పెద్దపల్లి జిల్లా యాదవ సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ, కీ.శే. గొడుగు అంజలి యాదవ్ కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకొని ప్రభుత్వం తరపున వచ్చే సహాయ సహకారాలు అందించవలసిందిగా వినతి పత్రాన్ని అందించడం జరిగింది.
కలెక్టరేట్ కార్యాలయ మీడియా పాయింట్ లో యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ…
సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్న ప్రముఖ రాజకీయ పార్టీలు, అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటు ఇదే ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తి కి అన్యాయం జరిగినప్పుడు స్పందించి నవాళ్ళు ఇప్పుడు ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతోనైన స్పందించాల్సిన రాజకీయ పార్టీలు , మహిళ సంఘాలు స్పందించకపోవడం, సహాయ సహకారాలు అందించాల్సినవారు ఆ పత్తకు కూడా రాకపోవడం వాళ్ళ నైతికతను తెలియజేస్తుంది అనీ అన్నారు….
ఆ కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో అన్నీ యాదవ సంఘాలను కూడగట్టి మరిన్నీ ఆందోళన కార్యక్రమాలతో జిల్లా యాదవ సంఘం ముందుకు వెళ్తుందని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు గొడుగు రమేష్ యాదవ్ గొడుగు మల్లేష్ యాదవ్ అవుల కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..
