అగ్నిధార న్యూస్, పెద్దపల్లి నిఘా:           

 పెద్దపల్లి మండలంలోని భోజన్నపేట గ్రామానికి చెందిన  కుడుదుల సాగర్ S/o రాజ కొమురయ్య ఇటీవల ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందగా పెద్దపల్లి మున్సిపల్ వారు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. అయిన కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎలాంటి విచారణ చేయకుండా మరో మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడం తో జిల్లా లో చర్చనీయాంశమైంది. జిల్లా పంచాయతీ శాఖ అధికారికి సంబంధిత లు లు ఫిర్యాదు చేశారు. ఇది మనకు  తెలిసిన విషయమే ఇట్టి విషయంపై , అగ్నిధార పత్రిక ఆదివారం రోజున ప్రత్యేక కథనాన్ని అందించింది. దీనితో సోమవారం ఎంపిఓ సుదర్శన్ భోజన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో,  విచారణ  చేపట్టి  పంచాయతీ కార్యదర్శి   రమేష్ ,  మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నవారు, ఫిర్యాదు ఇచ్చిన వారి, ,వాంగ్మూలలను  సేకరించి  ఉన్నతాధికారులకు     రిపోర్ట్   చేయనున్నట్లు  ఎంపిఓ   పేర్కొన్నారు.