✍️✍️ శ్రీనివాస్ అగ్నిధార న్యూస్ ప్రతినిధి:కామారెడ్డి
గత అయిదు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్నూర్ గ్రామంలో కరోనా టీకాల విషయమై తమ బాబు మరణించారంటూ ఏఎన్ఎం పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఏఎన్ఎం కు గాయాలయ్యాయి. దీంతో వైద్య సిబ్బంది తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామాల్లో కరోనా టీకాలు వేసెందుకు వెళ్లాలంటే వైద్య సిబ్బంది భయపడుతున్నారు.
ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో తాసిల్దార్ మరియు ఎస్ఐ ఆధ్వర్యంలో వైద్యసిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బీర్కుర్ మండల కేంద్రంలోని తహ్సిల్ కార్యాలయంలో తహసీల్దార్ రాజు, ఎస్ఐ రాజేష్, మండల వైద్యాధికారి రాజారమేష్ లు వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సిబ్బందికి దైర్యం , భరోసా కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమకు సమాచారం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రవీందర్, ఏఎన్ఎంలు లక్ష్మి, సునీత, ఆశాలు పాల్గొన్నారు.
