అగ్నిధార న్యూస్ రామగుండం
ప్రమాద బాధిత కుటుంబానికి భరోసా బాధితునికి మెరుగైనా వైద్యం అందేలా చుస్తా- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
ఇటీవల పెద్దపల్లి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన మెండ అనిల్ తీవ్రంగా గాయపడి హైదరాబాద్ సోమాజిగూడ లోని యశోద హాస్పటల్ లో చికిత్సపొందుతున్న విషయం తెలుసుకున్న, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బాధితుడు అనిల్ ని పరామర్శించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఆరోగ్య పరిస్థితిని సంబంధిత విషయాలు వైద్యులను ఆడిగి తెలుసుకున్నారు. అనిల్ కి మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ వైద్యులను కోరారు.వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది అని తెలుసుకున్న ఎమ్మెల్యే సి.ఎం సహాయనిధి ద్వారా వైద్య ఖర్చులు అందేలా చుాస్తమని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
