అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థు లే ఉపాధ్యాయులు అయిన వేల పాఠశాల ప్రాంతమంతా కొత్త వన్నెలు సంతరించుకొని పాఠశాల ప్రాంగణమంతా కళకళలాడింది. నిత్యం విద్యా బోధన తో ఉపాధ్యాయులు, పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు నేడు విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్యను బోధించడం తో ఆనందించారు. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో సంబంధిత అంశాలపై విద్యా బోధన తోటి విద్యార్థులకు బోధిస్తూ సంతోషించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కల్లోలం తర్వాత పాఠశాలలో ఇంత పెద్ద గొప్ప కార్యక్రమము జరగడం ఇదే ప్రథమం.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మా ప్రధానోపాధ్యాయునికి ఉపాధ్యాయులందరికీ శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన మండల విద్యాధికారి సురేందర్ కుమార్ మరియు గ్రామ సర్పంచ్ మల్లేశం మాట్లాడుతూ విద్య అనేది ప్రతి మనిషికి ఒక గొప్ప ఆయుధం దాన్ని మనం ఎలా మలచుకుంటే అలా మనల్ని మన జీవితాన్ని తయారు చేస్తోందన్నారు. విద్య యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు ప్రతి విద్యార్థి దేశానికి రాష్ట్రానికి పుట్టి పెరిగిన ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నారు. చదువులో రాణించాలంటే కృషితో పట్టుదలగా చదవాలన్నారు .విద్యార్థిని విద్యార్థులు నిత్యం వారి మెదడుకు పదును పెడుతూ కదులుతున్న విజ్ఞాన భాండాగారాలు గా తయారు కావాలన్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పోరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప విద్య గొప్పతనం గురించి చెప్పుతూ ఈరోజు పిల్లలు ఉపాధ్యాయులు అయినటువంటి వేల చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడి నిజం ఇదే పిల్లలు రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా తయారు చేసి నవ సమాజ నిర్మాణానికి వారిని పంపే గురుతర బాధ్యత ఒక ఉపాధ్యాయుని పైనే ఉంటుంది అన్నారు .అలాంటి వృత్తిలో ఉన్నందుకు గర్వపడుతున్నాం అన్నారు .ప్రపంచంలో చూసినట్లయితే నిత్యం ఎక్కడో ఒక కాడ మోసం జరుగుతూనే ఉంటుంది మోసం చేయనిది ఒక విద్య మాత్రమే అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ భాస్కర్ గ్రేస్ నిరీక్షణ కుమారస్వామి పి రూప కుమారస్వామి తిరుమల రవీందర్ ఉప సర్పంచ్ ఓదెల రాజు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
