అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:.                         

దుష్ట రాజకీయాలకు తెరతీస్తున్న బిజెపి  రైతులపై బిజెపి గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్న-మంత్రి కొప్పుల ఈశ్వర్……

బిజెపి,ఆ పార్టీ నాయకులు దుష్ట రాజకీయాలకు తెరతీశారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  మండిపడ్డారు. తెలంగాణలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రశాంతంగా కొనసాగుతుంటే, అనవసరంగా అక్కడకు పోయి విద్వేషాలు సృష్టిస్తున్నారని, ప్రజల మధ్య చిచ్చు పెడ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్  పండుగ చేసి చూపించారన్నారు . తెలంగాణ ఏర్పాటుకు ముందు ధీనాతిధీనంగా ఉన్న రైతన్నల పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగైందని అన్నారు . బండి సంజయ్ వందలాది మంది తన గుండాలతో నల్లగొండ జిల్లాకు వెళ్లడాన్ని, రైతులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు, మిషన్ కాకతీయ ద్వారా 46వేల చెరువులను బాగు చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చిందన్నారు.నాణ్యమైన విద్యుత్తును 24గంటలు అందిస్తున్నామని, ఇందుకు ఏటా 10వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు, పంట పెట్టుబడికి రైతుబంధు కింద ఇప్పటి దాక 44వేల కోట్లిచ్చామని, రైతు బీమా పథకం ద్వారా 59వేల 630మంది రైతులకు 2వేల 981కోట్లు అందజేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులకు నీటి తీరువా పన్నును పూర్తిగా ఎత్తేశామని, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశామని  వాఖ్యానించారు,నకలీ విత్తనాల పూర్తిగా అరికట్టామని, అమ్మే వారిపైన , సరఫరా చేసే వారిపై పి.డి యాక్ట్  కేసులు పెడ్తున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ రంగాన్ని, రైతులను గొప్పగా ఆదుకున్నారని, ఆదుకుంటున్నారని, దీంతో,16% వృద్ధి సాధించామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుండి ఇప్పటివరకు   4కోట్ల 93 లక్షల 73వేల851మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇందుకుగాను రైతులకు 85వేల757కోట్ల54లక్షలు చెల్లించామని మంత్రి వివరించారు.
సంజయ్ ఇప్పటికైనా తన తప్పును గ్రహించి తెలంగాణ రైతులకు,ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి కొప్పుల డిమాండ్ చేశారు .
తెలంగాణలో పండే పంటనంతా  కొంటామని కేంద్రం నుంచి ప్రకటన చేయించాలని సంజయ్ ను మంత్రి డిమాండ్ చేశారు.